ప్రధానమంత్రి ఏడేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా గర్భిణీలకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పౌష్టికాహారాన్ని అందించారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 70 మందికి ఈ పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మహమ్మారి కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కర్ణాకర్, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.