సాధరణంగా ఎండకాలంలో ఆవాసాలను వదిలి నీరు, ఆహారం వెతుక్కుంటూ వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తుంటాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ సమస్య నివారణ కోసం అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు.
అభయారణ్యంలో జంతువుల దాహార్తి తీర్చేడమే లక్ష్యంగా నీటి వనరుల ఏర్పాటుకు అటవీ శాఖలో ప్రత్యేకంగా ఓ విభాగం పని చేస్తుంది. ప్రతి వేసవిలో వాగులు, వంకలు ఎండిపోయి తాగునీటి ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో అటవీ శాఖ ఆద్వర్యంలో వాటిని కాపాడేందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించాం. సోలార్ పంప్ సెట్లు, సాసర్ పిట్లు నిర్మించి ట్యాకంర్ల ద్వారా నీటిని నింపడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. శాకాహార జంతువుల కోసం గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వన్యప్రాణుల కదలికలు పసిగట్టేందుకు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం. - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఇదీ చూడండి: నల్గొండ జిల్లాలో అటవీ అధికారులు బంధించిన చిరుత మృతి