child with kcr kit video viral: గర్భిణీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కేసీఆర్ కిట్. అయితే తాజాగా కేసీఆర్ కిట్‌ను చూస్తూ ఓ చిన్నారి సంబరిపోతున్న వీడియో వైరల్‌గా మరింది. ఆ వీడియోను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్ తాతా... తాతా... అంటూ ఓ చిన్నారి సంబరం చూస్తుంటే.. మనసు పొంగిపోతోందని పేర్కొన్నారు. కిట్‌పై ఉన్న కేసీఆర్ ఫొటోను తాతా అంటూ ఓ చిన్నారి ముద్దాడిన దృశ్యాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ అందించిన కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణ అందిస్తోందని హరీశ్ రావు తెలిపారు.
-
కేసీఆర్ కిట్ ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబరం చూస్తే మనస్సు పొంగిపోతున్నది.. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ గారు అందించిన కేసీఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నది. pic.twitter.com/ufh6w5mtrD
— Harish Rao Thanneeru (@trsharish) December 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">కేసీఆర్ కిట్ ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబరం చూస్తే మనస్సు పొంగిపోతున్నది.. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ గారు అందించిన కేసీఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నది. pic.twitter.com/ufh6w5mtrD
— Harish Rao Thanneeru (@trsharish) December 17, 2022కేసీఆర్ కిట్ ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబరం చూస్తే మనస్సు పొంగిపోతున్నది.. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ గారు అందించిన కేసీఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నది. pic.twitter.com/ufh6w5mtrD
— Harish Rao Thanneeru (@trsharish) December 17, 2022
ప్రభుత్వ ఆస్పత్రులలో పిల్లలకు జన్మించిన మహిళలు ఈ పథకం నుంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం ప్రసవం తర్వాత మహిళలకు, నవజాతు శిశువులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడం, వారు ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవడం. ఈ కిట్‌లో మహిళలకు, వారి పిల్లలకు కావాల్సిన 16 రకాల ఐటమ్‌లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. పుట్టిన పిల్లలు హైజీన్‌గా, సురక్షితంగా ఉండేలా కాపాడుతోంది. ఈ కిట్‌లో పుట్టిన పిల్లలకు అవసరమయ్యే డైపర్లు, నాప్కిన్స్, టోయ్స్, దోమ తెరలు, బేబీ ఆయిల్, బేబీ సోపులు, పిల్లలకు కావాల్సిన బట్టలున్నాయి. కేసీఆర్ కిట్ స్కీమ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు 2017 జూన్ 2న లాంచ్ చేశారు.
ఇవీ చూడండి: