Gangula on Fake CBI officer: నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కేసులో తనపై సీబీఐ జరిపిన విచారణపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి రూ. 15 లక్షలు అప్పుగా ఎంపీ రవిచంద్ర తనతో ఇప్పించారని పేర్కొన్న గంగుల.. తన ఫోటోలు, కాల్‌డేటా సీబీఐ దగ్గర ఉందని తెలిపారు. ఈనెల 1వ తేదీన దిల్లీలో సుమారు 20 నిమిషాలు తనను సీబీఐ విచారించిందని మంత్రి పేర్కొన్నారు.
గత నెల 26వ తేదీన తమిళనాడు భవన్‌లో శ్రీనివాసరావును అరెస్టు చేసిన సీబీఐ.. 27 నుంచి కస్టడీలోకి తీసుకొని విచారించింది. కస్టడీ గడువు ముగియడంతో శనివారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచింది. మరో 14 రోజులు ఆయన్ను విచారించేందుకు కస్టడీ గడువుకోరింది.
ఇవీ చదవండి: