ETV Bharat / state

Gangula Kamalakar: 'గవర్నర్ తమిళిసై రాజకీయాలు మాట్లాడటం బాధాకరం' - gangula counter to governor thamilisai

gangula kamalakar on Governor Comments: ఈ విపత్కర పరిస్థితుల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ సహా కేంద్రమంత్రులు, ఎంపీలు చేయాల్సింది రాజకీయాలు కాదని.. రాష్ట్ర ప్రజలకు, రైతులకు మద్దతుగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందిపడుతున్న ప్రస్తుత తరుణంలో గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం బాధాకరమన్నారు.

gangula comments on governor
'రాజకీయాలు కాదు.. రైతులకు అండగా నిలవాలి'
author img

By

Published : May 4, 2023, 7:10 PM IST

gangula kamalakar on Governor Comments: అకాల వర్షాలతో రైతులు ఇబ్బందిపడుతున్న ప్రస్తుత తరుణంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుండా రాజకీయాలు మాట్లాడటం బాధాకరమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాజ్​భవన్, ప్రగతిభవన్ మధ్య ఎంత దూరం, సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదనే ఫిర్యాదులు కాకుండా.. రైతుల పక్షాన గవర్నర్ ఉన్నారనుకుంటే అకాల వర్షాలతో జరుగుతున్న నష్టంపై మోదీకి సమాచారం ఇవ్వాలన్నారు. ఎఫ్​సీఐ నిబంధనలను సవరించమని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి అదనంగా కేంద్రం మరో రూ.20 వేలు ఇవ్వాలని గవర్నర్ సూచిస్తే బాగుండేదన్నారు.

ఈ సమయంలో చేయాల్సింది రాజకీయాలు కాదు: రాష్ట్ర ప్రజలు కట్టే జీఎస్టీ పన్నులతో కేంద్రం ఎంజాయ్ చేయొచ్చు కానీ, ఆ ప్రజలు, రైతులు కష్టాల్లో ఉంటే కేంద్రం సహకరించకపోవడం దారుణమని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా కేంద్రం, గవర్నర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దెబ్బతిన్న పంట పొలాల్లోకి తాము పిలవడానికి గవర్నర్‌ను తాము చెబితే కేంద్రం నియమించలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో గవర్నర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు చేయాల్సింది రాజకీయాలు కాదని.. రాష్ట్ర ప్రజలకు, రైతులకు మద్దతుగా ఉండాలని మంత్రి సూచించారు.

రైతుల ఇబ్బందులు తొలిగించమని ఎక్కని కొండ, తొక్కని బండ లేదు: ఈ క్లిష్ట సమయంలో గవర్నర్ సైతం బాధ్యత తీసుకోవాలని, ఎఫ్​సీఐ అధికారులను పిలిచి కేంద్రంపై ఒత్తిడి పెంచి రైతుల్ని ఆదుకోవడానికి కలిసి రావాలన్నారు. అవసరమైతే కల్లాల వద్దకు రావాలని, తాము సైతం పరిస్థితులను వివరిస్తామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి మొదలు గ్రామ స్థాయి ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరు రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నామని, అదే బాధ్యతను గవర్నర్ సహా కేంద్రమంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రతినిధులు తీసుకోవాలన్నారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని, తెలంగాణ రైతుల ఇబ్బందులు తొలిగించమని ఎక్కని కొండ, తొక్కని బండ లేదన్నారు. ఈ సమయంలో రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వంపై గవర్నర్ వ్యాఖ్యలు ఇవే: గత కొంతకాలంగా గవర్నర్​, ముఖ్యమంత్రి ఉప్పునిప్పులా ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రగతిభవన్ వర్సెస్ సచివాలయం అన్న తీరుగా మారింది. ప్రగతి భవన్​కు, సచివాలయానికి దూరం పెరిగిపోతుందని.. ప్రధానినైనా కలవొచ్చు కానీ, ఈ ముఖ్యమంత్రిని మాత్రం కలవలేమని గవర్నర్ విమర్శించారు. రాష్ట్ర కార్యక్రమాలకు తనను దూరం చేస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజు కూడా తనకు ఆహ్వానం అందలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా మంత్రి గంగుల స్పందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.