ETV Bharat / state

వారి సేవలు ఎనలేనివి... ప్రమోట్ చేయండి: మంత్రి ఈటల

స్వల్ప మార్కుల తేడాతో ఫెయిల్​ అయిన వైద్య విద్యార్థులను ప్రమోట్ చేయాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్​కు... మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో వారు చేసిన సేవలు ఎనలేనవని కొనియాడారు.

minister-etela-rajender-talk-with-central-minister-harshvardhan-on-phone-to-promote-medical-students-for-next-level
వాళ్లని ప్రమోట్ చేయండి... వారు చేసిన సేవలు ఎనలేనివి: ఈటల
author img

By

Published : Sep 17, 2020, 7:01 AM IST

కేంద్రమంత్రి హర్షవర్దన్​తో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్​లో మాట్లాడారు. కరోనా చికిత్సల్లో కీలక పాత్ర పోషించి... స్వల్ప మార్కుల తేడాతో ఫెయిల్ అయిన వైద్య విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఈటల కోరారు. వైద్య విద్యార్థులు నిరంతరాయంగా కరోనా రోగులకు చికిత్స అందించారని వివరించారు.

ఈ ఏడాది వైద్య విద్య పీజీ పరీక్షల్లో పలువురు విద్యార్థులు... ఫెయిల్ అయ్యారని... కరోనా కాలంలో రెగ్యులర్ తరగతులకు హాజరు కాలేకపోవడమే కారణమని వివరించారు. ఆ సమయంలో వారు కొవిడ్​ రోగులకు.. ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని... స్వల్ప తేడాతో ఫెయిల్ అయిన వారిని పాస్ చేయాలని ఈటల కోరారు. ఈ ఏడాది పీజీ పరీక్షలకు... 1,040 మంది హాజరుకాగా.. వారిలో 100 మంది స్వల్ప తేడాతో ఫెయిల్ అయినట్లు సమాచారం.

ఇదీ చూడండి: వైద్యశాఖలో త్వరలో 11 వేల నియామకాలు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.