ETV Bharat / state

అభివృద్ధి ప‌నుల్లో ఆల‌స్యం త‌గ‌దు: మంత్రి ఎర్రబెల్లి

అభివృద్ధి ప‌నుల్లో జాప్యం త‌గ‌దని.. కరోనా కారణంగా కుంటుపడిన పనులన్నీ రెట్టింపు వేగంతో పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అధికారులను ఆదేశించారు. పంచాయ‌తీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.

minister errabelli dayakar rao review on development works
అభివృద్ధి ప‌నుల్లో ఆల‌స్యం త‌గ‌దు: మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Oct 27, 2020, 1:56 PM IST

పంచాయ‌తీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు స్పష్టం చేశారు. కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి తదితరులతో సమావేశమైన మంత్రి... శాఖ పరిధిలో జరుగుతున్న రైతు వేదిక‌ల నిర్మాణం, పీఎంజీఎస్​వై రహదారి పనుల పురోగతిని సమీక్షించారు.

నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా ఆయా పనులు సకాలంలో జరగాలని స్పష్టం చేశారు. రైతు వేదిక‌లు, రహదార్లు, ఇత‌ర ప‌నుల‌న్నీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి ప‌నుల్లో ఆల‌స్యం త‌గ‌దని, ఆయా ప‌నులను అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌ర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. కరోనా నేప‌థ్యంలో కుంటుప‌డిన ప‌నుల‌న్నీ రెట్టించిన వేగంగా పూర్తి చేయాల‌ని అధికారుల‌కు మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఇదీ చూడండి: ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి ఈటల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.