చనిపోయినవారికి కొవిడ్ పరీక్షలు చేయాలని హైకోర్టు వాదన అశాస్త్రీయమైందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌లో కూడా చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయాలని లేదని వెల్లడించారు.
రాష్ట్రంలో నిత్యం 1000 మంది చనిపోతారని... వారికి కరోనా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడిన వారే.. కరోనా బారిన పడి చనిపోతున్నారని చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ఒకే ఇంట్లో 26 మందికి కరోనా