ETV Bharat / state

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

సనత్​ నగర్ నియోజకవర్గంలోని పార్క్ లైన్, నల్లగుట్ట ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్​తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ శంకుస్థాపన చేశారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, కార్పొరేటర్
author img

By

Published : Aug 27, 2019, 4:16 PM IST

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, కార్పొరేటర్

సనత్​నగర్ నియోజకవర్గం రాంగోపాల్​పేట్ డివిజన్ పరిధిలోని పార్క్ లైన్, నల్లగుట్ట ప్రాంతాల్లో రూ.1.56 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, కార్పొరేటర్ శ్రీమతి అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్​ కార్యక్రమానికి హాజరై పనులను ప్రారంభించారు. అందులో 80 లక్షల వ్యయంతో పార్క్ లైన్ చౌరస్తా నుండి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు.. 40 లక్షల వ్యయంతో మమత స్వీట్ షాప్ నుండి నల్లగుట్ట జులమ్మా టెంపుల్ నాలా వరకు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, జీహెచ్ఎంసీ డీసీ నళిని పద్మావతి, ఇంజనీరింగ్ డీఈ ప్రశాంతి, ఏఈ రవీందర్, సెక్షన్ మేనేజర్ సురేష్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కుదుస్​తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి;జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్‌కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.