ETV Bharat / state

శిక్షించడమే కాదు... రక్షించడమూ తెలుసు..

కరోనా విజృంభనతో జన జీవనం స్తంభించి పోయింది. కూడూ, గూడూ లేని అభాగ్యులు పరిస్థితి దుర్భరంగా మారింది. బుక్కెడు బువ్వలేక.. గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడిపోతూ బిక్కుబిక్కుమంటూ తిరుగుతూ... ఎండకు సొమ్మసిల్లి పడిపోతున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కొందరు అభాగ్యులను ఆదుకుంటూ మానవత్వానికి నిలువుటద్దంగా నిలుస్తున్నారు.

Migrant victims awaiting government assistance
ఆదుకున్న పోలీసు హస్తం
author img

By

Published : Mar 31, 2020, 7:24 PM IST

Updated : Mar 31, 2020, 8:14 PM IST

రాష్ట్రమంతా లాక్​డౌన్​... కూడూ గూడూ లేని అభాగ్యులు నడిరోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ప్రభుత్వం అందించే సాయం కోసం ఉదయం నుంచి రోడ్లపైనే ఎదురు చూస్తూ గడిపారు. సికింద్రాబాద్​ గాంధీ ఆస్పత్రి సమీపంలో నడిరోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన ఓ అభాగ్యుడిని పోలీస్ చేరదీశారు. అతనికి నీళ్లు పట్టించి.. అన్నంపెట్టించి కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలను నిలబెట్టాడు.

ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య

Last Updated : Mar 31, 2020, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.