వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో స్వస్థలాలకు పయనమవుతున్నారు. సికింద్రాబాద్, అల్వాల్, బొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో నివసిస్తున్న వలస కూలీలు అల్వాల్ పోలీస్ స్టేషన్కు భారీగా తరలివచ్చారు. అనంతరం భౌతిక దూరాన్ని పాటిస్తూనే తమ పేర్లు, ఆధార్ తదితర వివరాలు పోలీసులకు అందిస్తున్నారు.
బొల్లారం, కౌకూర్, అల్వాల్లో...
ఠాణాలో తమ వివరాలు నమోదు చేసుకున్న అనంతరం రైళ్లలో తమ ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు గత కొన్నాళ్లుగా అల్వాల్, కౌకూర్, బొల్లారం ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పనులు చేస్తున్నారు. లాక్డౌన్ అమలుతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది.
ఠాణాలకు క్యూ...
దాదాపు 400 మంది వలస కార్మికులు క్యూలైన్లో నిలబడి తమ వివరాలను పోలీసులకు తెలియజేస్తున్నారు. ఈ వివరాల ప్రకారం రైలు ఏ సమయంలో వస్తుందనే సమాచారాన్ని పోలీసులు ఎస్ఎంఎస్ ద్వారా బాధితులకు అందజేస్తున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి : క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!