ETV Bharat / state

తెలంగాణపై మిగ్​జాం తుపాన్ ఎఫెక్ట్​ - అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు​

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 4:18 PM IST

Michaung Toofan effects in State : మిగ్‌జాం తీవ్ర తుపాను ప్రభావం రాష్ట్రంపై పడుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భాగ్యనగరంలో ఈదురు గాలులు, చిరు జల్లులతో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగ్​జాం తుఫాన్‌ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది.

Michaung Toofan effects in State
తెలంగాణపై మిగ్​జాం తుపాన్ ఎఫెక్ట్​ - భారీ నుంచి అతి భారీ వర్షాలు​

Michaung Toofan effects in State : మిగ్‌జాం తీవ్ర తుపాను ప్రభావం రాష్ట్రంపై పడుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు పడుతాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం వుందని తెలిపింది.

ముఖ్యమంత్రిగా రేవంత్‌వైపే రాహుల్‌ మొగ్గు - సాయంత్రం సీఎల్పీ భేటీలో ప్రకటించనున్న డీకే

Heavy Rain in Telangana due to Cyclone Michaung : మిగ్‌జాం తుపాన్‌ తీవ్రత బలపడటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. భాగ్యనగరంలో ఈదురు గాలులు, చిరు జల్లులతో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఏపీకి సమీపంలో ఉన్న మండలాల్లో వర్షాల కారణంగా వరి పంటలపై ప్రభావం చూపుతుంది. జిల్లాలోని దమ్మపేట, వేంసూరు, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, సత్తుపల్లి, కల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్‌ ప్రభావంతో విద్యార్థులు ఇబ్బందిపడుతారని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఉదయం నుంచి చల్లటి గాలులతో వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉదయం నుంచి ఓ మోస్తారుతో కూడిన వర్షం కురుస్తుంది. యాదాద్రి ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు ముసురు వర్షంలో తడుస్తూనే స్వామివారి దర్శించుకుంటున్నారు

Severe Rainfall alert in telangana : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా మిగ్‌జాం తుపాన్ కారణంగా గత రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. వర్షానికి ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. భారీ వర్షానికి వరి, పత్తి పంటలకి తీవ్ర నష్టం కలిగింది. రైతులు వరి కోసి రోడుపై ధాన్యం ఆరబోసారు.

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. ధాన్యం తడవకుండా రైతులు పట్టాలు కప్పిన, ఈదుర గాలుల వలన చాలా చోట్ల ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

మిగ్​జాం తుపాను ఎఫెక్ట్​తో 305 రైళ్లు రద్దు - ఇదిగో పూర్తి లిస్ట్‌

Trains Cancelled for Cyclone Michaung Effect : మిగ్​జాం తుపాన్‌ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను కూడా దారిమళ్లించినట్లు అరుణ్‌ కుమార్ జైన్ పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా 305 రైళ్లను రద్దు చేశామన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రైళ్లను రద్దు చేస్తామని అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే తిరిగి పునరుద్దరిస్తామని వెల్లడించారు.

హైదరాబాద్​లో వచ్చిన ఫలితాలు లోక్​సభలో కూడా రిపీటైతే - ఆ పార్టీకి ఇబ్బందే!

యాదాద్రి ఆలయానికి మరో ఘనత రూ.5.40 కోట్లలో విమాన గోపురానికి రాగి తొడుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.