ETV Bharat / state

తెలంగాణపై మిగ్​జాం తుపాను ప్రభావం - పలు విమానాలు రద్దు - తెలంగాణపై మిగ్​జాం తుపాను ప్రభావం

Michaung Cyclone Effect in Telangana : మిగ్‌జాం తుఫాను తీవ్రంగా బలపడడంతో దాని ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.

Two Days Rains in Telangana
Michaung Cyclone Effect in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 3:57 PM IST

Michaung Cyclone Effect in Telangana : మిగ్‌జాం తుఫాను తీవ్రంగా బలపడింది దాని ప్రభావం తెలంగాణపై పడింది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను పయనిస్తుంది. గంటకు 10కి.మీ వేగంతో తుఫాన్​ కదులుతుంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు నిజాంపట్నం వద్ద తీరం దాటనున్న మిగ్​జాం తీవ్ర తుపాను. దీని కారణంగా రేపు రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు

Two Days Rains in Telangana : తుఫాను తీవ్రంగా మారడంతో హైదరాబాద్​లో వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడడంతోపాటు నిరంతార్యంగా కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంక్​బండ్​ పరిసర ప్రాంతాల్లో వచ్చిన పర్యాటకులు వర్షానికి తడిసిముద్దయ్యారు. అటుగా వెళ్లే వాహనదారులు వర్షంలో తడుస్తూ వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ పలు సూచనలు జారీ చేసింది.

దూసుకొస్తున్న మిగ్​జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు

Michaung Cyclone Impact on Telangana : తుఫాను కారణంగా భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్​కర్నూల్​ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్​, హనుమకొండ, కరీంనగర్​, సిద్దిపేట, జనగాం, జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మి. వేగంతో వీచే అవకాశముందని తెలిపింది.

Heavy Rains in Hyderabad : భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

Several Flights Cancelled Due to Cyclone Effect in Telangana : రాష్ట్రంలో తుఫాను దృష్ట్యా పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖ-చెన్నై, విశాఖ-హైదరాబాద్​, విశాఖ-విజయవాడ ఇండిగో విమాన సర్వీసులు నిలిపి వేశారు. ఎల్లుండి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మి. వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ప్రజల తుఫాన్​ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పలు హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ్య, బాపట్లకు దగ్గరగా దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

భారీగా వర్షాలు, రైలు పట్టాలపై నీరు-మిగ్‌జాం తుపానుతో స్తంభించిన రవాణా వ్యవస్థ!

అకస్మాత్తుగా వర్షం, ఇబ్బంది పడిన వాహనదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.