ETV Bharat / state

మిగ్​ జాం తుఫాను ప్రభావం - నష్టాల్లో మునుగుతున్న తెలంగాణ రైతులు - తుఫాను కారణంగా పంట నష్టపోతున్న రైతులు

మిగ్ జాం తుపాను ప్రభావం రాష్ట్రంపైనా పడింది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో ధాన్యం తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుపాను తీవ్రతకు రేపు కూడాఉంటుందని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Michaung Cyclone Affect on Crops of Telangana
Michaung Cyclone Affect in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 7:55 PM IST

Michaung Cyclone Affect in Telangana మిగ్​ జాం తుఫాను ప్రభావం నష్టాల్లో మునుగుతున్న తెలంగాణ రైతులు

Michaung Cyclone Affect in Telangana : మిగ్ జాం తుపాను తీవ్రతతో హైదరాబాద్‌లో నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వర్షాల దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తెలంగాణపై మిగ్​జాం తుపాన్ ఎఫెక్ట్​ - అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు​

Michaung Cyclone Affect on Crops of Telangana : జిల్లాల్లోనూ మిగ్‌జాం తుపాను ప్రభావం చూపింది. ఖమ్మం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని దమ్మపేట, వేంసూరు, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, సత్తుపల్లి, కల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి వరి, పత్తి పంటలకి తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరారు. ఎడతెరిపి లేని వర్షాలతో ఖమ్మం జిల్లాలో పాఠశాలలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.

Telangana Farmers Request To Government To Buy Crop : జోరు వానలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కల్లాలు, రహదారులపై ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా పలు మండలాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. చలిగాలుల తీవ్రత పెరగడంతోపాటు యాదగిరిగుట్టలో ఓ మోస్తరు వానతో ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు.

మిగ్​జాం తుపాను ఎఫెక్ట్​తో 305 రైళ్లు రద్దు - ఇదిగో పూర్తి లిస్ట్‌

హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. చల్లటి గాలులకుతోడు వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తుపాను ప్రభావంతో రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు.

తెలంగాణపై మిగ్​జాం ఎఫెక్ట్ - ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.