జంట నగరాల నిరుద్యోగ యువతీ, యువకులు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. ఏప్రిల్ 7న సీతాఫలమండీలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో జరగనుందని తెలిపారు. 30 ప్రధాన ప్రైవేటు రంగ సంస్థలు ఆ మెగా జాబ్ మేళాకు వస్తాయని చెప్పారు. సెట్విన్ ఎండీ వేణుగోపాల్, ఇతర అధికారులు, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఆయన మెగా జాబ్ మేళా కర దీపికను సీతాఫల్మండీలో ఆవిష్కరించారు.
పట్ట భద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు మొదలుకుని సాధారణ విద్యార్హత, ఏ విద్యార్హతలు లేని వారికీ సైతం వివిధ ఉద్యోగాలు అందించేలా ఏర్పాట్లు ఉన్నాయని సెట్విన్ ఎండీ వేణు గోపాల్ వెల్లడించారు. పద్మారావు గౌడ్ జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 7న భారీ స్థాయిలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి : కరోనా వ్యాప్తి దృష్ట్యా పండుగలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం