ETV Bharat / state

All party Meeting about Podu Lands: 'అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించాలి'

హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో అఖిలపక్షాల నేతల సమావేశం జరిగింది. పోడు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో... 'పోడు భూముల సమస్య - ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలపై' చర్చ జరిగింది. ఈ భేటీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహా గిరిజన, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

Meeting of all party leaders at Baghlingampally

author img

By

Published : Nov 8, 2021, 1:15 PM IST

All party Meeting about Podu Lands: 'అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయం స్వీకరించాలి'

పోడు భూముల అంశంపై రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో అఖిలపక్షాల నేతల సమావేశం జరిగింది. పోడు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో... 'పోడు భూముల సమస్య- ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలపై' చర్చ జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహా గిరిజన, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అనేక తరాలుగా భూములు దున్నుకుంటూ బతుకుతున్న కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయడం లేదు?

పోడు భూముల అంశంపై చర్చించేందుకు అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. పోడు రైతులను భాగస్వామ్యం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు రోడ్ మ్యాప్ రూపకల్పన చేసి ప్రకటించాలని డిమాండ్​ చేశారు. నవంబర్​ 8 నుంచి డిసెంబర్​ 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించే హక్కు ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. మూడు మాసాల తర్వాత పొడగించుకునే హక్కు గ్రామసభకు ఉంటుందన్నారు. ఇది పోడుదారుల జీవిత సమస్య అని పేర్కొన్నారు. నిన్న భాజపాకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట్లాడినంత మాత్రాన ఎవరూ విశ్వసించరని తెలిపారు.

పోడుదారుల బతుకులు ఎడారిగా మారుతున్నాయి. అటవీ హక్కుల చట్టం అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చట్టంలో లోపాలు సవరించేందుకు అవసరమైతే పోడుదారులను దిల్లీ తీసుకెళతామన్నారు సీఎం కేసీఆర్​. పోడు, రెవెన్యూ భూముల సరిహద్దు సమస్య తీరలేదు. ఇప్పటికైనా చట్టం పరిధిలో చర్యలు తీసుకోవాలి.

- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

సమావేశం నిర్వహించి అభిప్రాయం స్వీకరించాలి

పోడు భూముల అంశంపై రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయం స్వీకరించాలని తెజస అధ్యక్షుడు కోదండరామ్ పేర్కొన్నారు. సంప్రదాయంగా అడవులలో నివసించే కుటుంబాలను గుర్తించాలన్నారు. భూమి, అడవిపై హక్కల విషయంలో శాటిలైట్​పై ఆధాపడతామంటే కుదరదన్నారు. అనేక తరాలుగా భూములు దున్నుకుంటూ బతుకుతున్న కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

పోడు భూముల అంశంపై రాష్ట్ర స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయం స్వీకరించాలి. సంప్రదాయంగా అడవులలో నివసించే కుటుంబాలను గుర్తించాలి . అనేక తరాలుగా భూములు దున్నుకుంటూ బతుకుతున్న కుటుంబాలకు న్యాయం చేయాలి. పోడు రైతుల పక్షాన పోరాటం చేస్తాం

- కోదండరామ్, తెజస అధ్యక్షుడు

ఆదివాసీలను ఖాళీ చేయించే కుట్ర

చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని చెప్పారని రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ అంశం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు అపాయింట్​మెంట్ కోరామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా కలుస్తామని పేర్కొన్నారు. పోడుదారుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భూమి హక్కుల ముసుగులో సంప్రదాయంగా అడవినే నమ్ముకున్న ఆదివాసీలను ఖాళీ చేయించే కుట్ర సాగుతుందని ఆరోపించారు.

ఎడారిగా పోడుదారుల బతుకులు

పోడుదారుల బతుకులు ఎడారిగా మారుతున్నాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. అటవీ హక్కుల చట్టం అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చట్టంలో లోపాలు సవరించేందుకు అవసరమైతే పోడుదారులను సీఎం దిల్లీకి తీసుకెళ్తామన్నారని గుర్తుచేశారు. పోడు, రెవెన్యూ భూముల సరిహద్దు సమస్య తీరలేదని చాడ అన్నారు.

ఇప్పటికైనా చట్టం పరిధిలో చర్యలు తీసుకోవాలి. పంటే కాదు... భూమిపై కూడా హక్కులు ఇచ్చి పట్టాలు అందజేయాలి. అప్పటివరకు ఈ పోరాటం ఆగదు. ఆదివాసీలకు రైతుబంధు, రైతు బీమా వర్తింపజేసే వరకు ఉద్యమం సాగుతుంది. చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇదీ చదవండి: చెన్నైలో స్కూళ్లు బంద్​- వరదలతో స్తంభించిన జనజీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.