ETV Bharat / state

పనికి తగిన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ ధర్నా - మెడికల్​ సిబ్బంది ధర్నా

కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మెడికల్ సిబ్బంది డిమాండ్​ చేసింది. హైదరాబాద్​ హిమాయత్​నగర్​లోని ఏఐటీయూసీ భవన్​ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

medical-employees-protest-in-front-of-aituc-office-at-himayat-nagar-in-hyderabad
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఏఐటీయూసీ ధర్నా
author img

By

Published : Sep 10, 2020, 5:16 PM IST

హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని ఏఐటీయూసీ భవన్ ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొని ప్రభుత్వ మొండి వైఖరిని తీవ్రంగా నిరసించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి... కోర్టు తీర్పులను అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుండా వైద్యశాఖ అధికారులు, మంత్రులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.

డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసినప్పుడల్లా హామీలిచ్చి తప్పుకుంటున్నారే తప్ప చిత్తశుద్ధితో పరిష్కరించిన దాఖలాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబద్ధతతో వైద్య సేవలు అందిస్తున్న వారికి అలవెన్స్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదని వారు ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో డిమాండ్ల పరిష్కారానికై... ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఎక్కడికక్కడ పోరాటాలు ఉద్ధృతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: రఫేల్​ జెట్ల​ విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.