సింగరేణి సంస్థకు విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని... సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షుడు కె.రవిశంకర్ తెలిపారు. సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని సింగరేణి కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఆధ్వర్యంలో సమీప గ్రామాల ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ప్రతి నెలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సంస్థ ఏటా రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన వారికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే సీపీఆర్ఎస్ కార్డులను పంపిణీ చేశామన్నారు. ఈ అవకాశాన్ని హైదరాబాద్‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగరేణితో ఒప్పందం గల ఆసుపత్రుల్లో వినియోగించుకోవచ్చని చెప్పారు.
ఇదీ చదవండి: భాజపా ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోంది: కారెం