ETV Bharat / state

మధ్యవర్తిత్వం చేశారు..  ఏసీబీకి చిక్కారు

"మహానగర పాలక సంస్థ అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారు... బీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారా... అధికారులు మీకు తాఖీదులు ఇచ్చారు... జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం వారు 5 లక్షల రూపాయలు అడుగుతున్నారు. మీరు 2 లక్షలు ఇస్తానంటున్నారు. మధ్యే మార్గంగా 3 లక్షలు ఇవ్వండి అందరం పంచుకుంటాం... దీంతో మీకు ఎటువంటి ఇబ్బందులు రావు." ఇదీ ఏసీబీకి చిక్కిన ఇద్దరు విలేకరులు భవన యజమానితో చేసిన బేరసారాల సారంశం.

మధ్యవర్తిత్వం చేశారు..  ఏసీబీకి చిక్కారు
author img

By

Published : Nov 17, 2019, 4:17 PM IST

మధ్యవర్తిత్వం చేశారు.. ఏసీబీకి చిక్కారు

జీహెచ్​ఎంసీ అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారు. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం అధికారులకు లంచం ఇవ్వాలంటూ హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని భవన యజమాని కేశవరెడ్డితో విలేకరులు శ్రీనివాసులు, కిరణ్‌గౌడ్‌ మధ్యవర్తిత్వం నడిపించారు. ప్రణాళిక విభాగం సెక్షన్‌ అధికారి మదన్‌రాజ్‌తో వారిద్దరు కుమ్మకై ఏకంగా భవన యజమానిని 5లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు.

జీహెచ్‌ఎంసీ సిబ్బంది అని చెప్పి అక్రమంగా నిర్మించిన షెడ్డు కొలతలు తీసుకున్నారు. మూడు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. డబ్బును అందరం పంచుకుంటామని చెప్పారు. అయితే ఓ హోటల్‌లో మొదట రెండు లక్షలు ఇచ్చిన కేశవరెడ్డి... లక్ష రూపాయలు మరుసటి రోజు తన ఇంటికి వచ్చి తీసుకోమని వారికి చెప్పాడు.

కిరణ్‌, శ్రీనివాసులు అతని ఇంటికి వెళ్లి డబ్బు తీసుకుంటుండగా ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వారిద్దరిని పట్టుకున్నారు. లంచాలు డిమాండ్‌ చేసే ప్రభుత్వ ఉద్యోగలపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు మధ్యవర్తిత్వం వహించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చూడండి: "సమ్మె చట్ట విరుద్ధం.. విధుల్లో చేరినా కొనసాగింపు కష్టమే..."

TG_HYD_06_17_ACB_RAIDS_VIDEOS_PKG_3066407 REPORTER:K.SRINIVAS NOTE:టిజి టిక్కర్‌ వాట్సప్‌ ద్వారా ఫీడ్‌ వచ్చింది. ( )మహానగర పాలక సంస్థ అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారు.... బీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు... అధికారులు మీకు తాఖీదులు ఇచ్చారు... ఇదేమీ కాదు జీహెచ్‌ఎంసి ప్రణాళిక విభాగం వారు 5 లక్షల రూపాయలు అడుగుతున్నారు. మీరు 2 లక్షలు ఇస్తానంటున్నారు. మధ్యే మార్గంగా 3 లక్షలు ఇవ్వండం అందరం పంచుకుంటాం... దీంతో మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. మీ భవనం పై ఈగ కూడా వాలదు. ఇదీ ఏసీబీకి చిక్కిన ఇద్దరు విలేకరులు భవన యజమానితో చేసిన బేరసారాల సారంశం.....LOOOK V.O:ఎటువంటి అనుమతి లేకుండా షెడ్డు నిర్మించారు. ఈ విషయంలో జీహెచ్‌ఎంసి ప్రణాళిక విభాగం అధికారులకు లంచం ఇవ్వాలంటూ జూబ్లీహిల్స్‌లోని భవన యజమాని కేశవరెడ్డితో విలేకరులు శ్రీనివాసులు, కిరణ్‌గౌడ్‌ మధ్యవర్తిత్వం నడిపించారు. ప్రణాళిక విభాగం సెక్షన్‌ అధికారి మదన్‌రాజ్‌తో వారిద్దరు కుమ్మకై ఏకంగా భవన యజమానిని 5లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. తాము జీహెచ్‌ఎంసి సిబ్బంది అంటూ చెప్పి వారిద్దరు అక్రమంగా నిర్మించిన షెడ్డు కొలతలు సైతం వారు తీసుకున్నారు. మూడు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. డబ్బును అందరం పంచుకుంటామని చెప్పారు. అయితే ఓ హోటల్‌లో మొదట రెండు లక్షలు ఇచ్చిన కేశవరెడ్డి... లక్ష రూపాయలు మరుసటి రోజు తన ఇంటికి వచ్చి తీసుకోవాలన్నాడు. కిరణ్‌, శ్రీనివాసులు అతని ఇంటికి వెళ్లి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు నిమిషాల వ్యవధిలో వారిద్దరిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు బయటపడ్డాయి. E.V.O:లంచాలు డిమాండ్‌ చేసే ప్రభుత్వ ఉద్యోగలపై చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు మధ్యవర్తత్వం వహించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వారు చెబుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.