ETV Bharat / state

ప్రభుత్వ ఖర్చుతో పారిశుద్ధ్య కార్మికురాలికి వైద్యం! - పారిశుద్ధ్య కార్మికురాలిని పరామర్శించిన మేయర్​ బొంతు రామ్మోహన్​

ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన పారిశుద్ధ్య కార్మికురాలికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించనున్నట్లు నగర​ మేయర్​ బొంతు రామ్మోహన్​ తెలిపారు. ఈ విషయమై రవాణా శాఖ మంత్రితో చర్చించగా ఆయన అంగీకరించారని చెప్పారు. గాయపడిన కార్మికురాలు ప్రస్తుతం ఉస్మానియా ఆస్రత్రిలో చికిత్స పొందుతోంది.

mayor consults sanitation worker in usmania hospital
ప్రభుత్వ ఖర్చుతో పారిశుద్ధ్య కార్మికురాలికి వైద్యం
author img

By

Published : Nov 9, 2020, 8:26 AM IST

హైదరాబాద్​లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు భారతమ్మకు.. ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించనున్నట్లు మేయర్​ బొంతు రామ్మోహన్ తెలిపారు. సంతోష్​నగర్ సర్కిల్లోని ఐఎస్ సదన్ క్రాస్ రోడ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న భారతమ్మని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడం వల్ల తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్నమేయర్.. ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని గాయపడిన కార్మికురాలిని పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి భారతమ్మకు మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఖర్చుతో మెరుగైన వైద్య చికిత్స అందించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ను కోరగా అందుకు ఆయన అంగీకరించారని మేయర్ వెల్లడించారు.

ఇదీ చదవండి: 'కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. కురుమూర్తి జాతర జరుపుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.