ETV Bharat / state

"డబుల్"​ వేగంతో బ్యూటిఫుల్​ చేయండి

ఎన్నికల నేపథ్యంలో మందగించిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ మేయర్​ బొంతు రామ్మోహన్​ అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

double bedroom houses
double bedroom houses
author img

By

Published : May 29, 2019, 5:32 AM IST

Updated : Nov 9, 2022, 1:41 PM IST

రెండో దశలో మరో లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని హైదరాబాద్ మేయర్​ బొంతురామ్మోహన్​ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పురోగ‌తిపై ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో మేయర్ స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల రూపకల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగాలన్నారు. పూర్తైన 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించే వరకు భద్రత కల్పించాలని సూచించారు. తొమ్మిది నెలల్లోగా మిగిలిన ఇళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు.

ప్రతి వాహనానికి ప్రత్యేక గుర్తింపు

గ్రేటర్​ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు, వ్యర్థాలను రోడ్లు, చెరువుల్లో వేసేవారిపై కఠినంగా వ్యవహరించి జరిమానా విధించాలని మేయర్​ నిర్ణయించారు. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలు తరలించే వాహనాలు జీహెచ్​ఎంసీ వద్ద రిజిస్టర్​ చేసుకోవాలని సూచించారు. ప్రతి వాహనానికి వ్యర్థాలు వేయడానికి స్థలంతో పాటు ప్రత్యేక గుర్తింపు జారీ చేస్తామని తెలిపారు.

టన్నుకు రూ. 360 ఛార్జ్

నిర్మాణ వ్యర్థాలు అక్రమంగా వేసే వాహనాలు సీజ్​ చేసి కేసు నమోదు చేసే అధికారాన్ని జీహెచ్​ఎంసీ ఇంజినీరింగ్, మెడికల్​ ఆఫీసర్లతో పాటు పోలీసు, రెవెన్యూ అధికారులకూ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని మేయర్​ ఆదేశించారు. ఈ వ్య‌ర్థాల‌ను ఎప్పటిక‌ప్పుడు తొల‌గించి రీసైక్లింగ్ చేయ‌డానికి న‌గ‌రంలో ప్రస్తుతం జీడిమెట్ల, ఫ‌తుల్ల‌గూడ‌, జ‌వ‌హార్‌న‌గ‌ర్ ప్రాంతాల్లో డిపాజిట్ చేస్తున్నామ‌ని తెలిపారు. భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌ను జీహెచ్ఎంసీ ద్వారా త‌ర‌లించేందుకు ట‌న్నుకు 360 రూపాయ‌ల‌ను యూజ‌ర్ ఛార్జీల కింద వ‌సూలు చేయ‌డానికి నిర్ణ‌యించామ‌ని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతా : దీదీ

Last Updated : Nov 9, 2022, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.