ETV Bharat / state

త్రి ధర్మం... మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు! - గుంటూరులో మూడు మత ఆచారాల్లో పెళ్లి తాజా వార్తలు

పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైన సందర్భం. అందుకే వివాహాన్ని మరపురాని జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించింది ఆ జంట. అందుకోసం మూడు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

marriage in three traditions at guntur in andhra pradesh
మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు!
author img

By

Published : Nov 22, 2020, 12:14 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలిలో ఓ జంటకు వివాహమైంది. దీనిలో గొప్పేంటి అందరికీ అయ్యేదే కదా అనుకుంటున్నారా? కానీ ఈ జంట తమ పెళ్లిని ఎప్పటికీ మరచిపోలేని విధంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ వారు ఏమి చేశారంటే... తెనాలికి చెందిన పూలివర్తి దిలీప్ కుమార్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్​లో ఏరోఫాల్కన్ ఏవియేషన్ పేరిట సంస్థను నిర్వహిస్తున్నారు. దిలీప్​కు హైదరాబాద్​కు చెందిన కమలాబాయితో వివాహం కుదిరింది.

మూడు మతాల సాక్షిగా ఒక్కటయ్యారు!

తమ పెళ్లిని ఎప్పటికీ మరచిపోలేని విధంగా చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరు... ఈ మేరకు 21వ తేదిన తెనాలిలోని గౌతం గ్రాండ్ హోటల్లో మూడు మతాచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బంధుమిత్రుల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పాస్టర్ దీవెనల మధ్య వివాహం జరిగింది. సాయంత్రం ముస్లిం మతపెద్దలు చేసిన దువాతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాత్రి హిందూ విధానంలో వధువు మెడలో దిలీప్ తాళి కట్టారు. ఇలా మూడు సంప్రదాయాలు అనుసరించి దిలీప్, కమల దంపతులయ్యారు.

ఇదీ చదవండి: ప్రేమ్​నగరం నుంచి విశ్వనగరం.. హైదరాబాద్​ ప్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.