వినియోగదారులందరికీ కూరగాయలు అందేలా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విస్తృత చర్యలు తీసుకుంది. ఇందుకు ఇప్పటికే సంచార రైతు బజార్లను ప్రారంభించగా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నగరంలో ఆన్‌లైన్ ఆర్డర్లపై ఆహారాన్ని ఇళ్లకు సరఫరా చేసే జొమాటో, స్విగ్గీతో పాటు పలు సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. సూపర్ మార్కెట్లు సైతం ఇళ్లకు సరకులు సరఫరా చేసేలా చూడాలని దిశానిర్దేశం చేసింది.
నగరంలో మరిన్ని విక్రయ కేంద్రాలు
నగరంలో ఇప్పుడున్న 12 రైతు బజార్లలో రద్దీని నియంత్రించడం కత్తిమీద సాములా మారింది. ఉదయం వేళ వేలాదిగా తరలివస్తోన్న కొనుగోలుదారుల వల్ల కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్నందున నగరంలో మరిన్ని అమ్మక కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి చెప్పారు. 177 వాహనాల ద్వారా 331 ప్రాంతాల్లో సంచార రైతుబజార్లను నగరంలో ప్రారంభించామని తెలిపారు. వారాంతపు సంతలు కూడా ఏర్పటు చేస్తున్నామన్నారు. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పారిశుద్ధ్యానికి రూ.27.90 లక్షలు
రైతుబజార్లతోపాటు హోల్‌సేల్ మార్కెట్లలో పారిశుద్ధ్యం కోసం రూ. 27.90 లక్షలు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కేటాయించింది. మరుగుదొడ్లు, క్యాంటిన్ల వద్ద శానిటైజర్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు లిక్విడ్ సోప్‌లు అందుబాటులో ఉంచేందుకు ఈ నిధులను ఇప్పటికే అందజేశామన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాలోగానీ, ధరల విషయంలోగానీ ఎలాంటి ఇబ్బందులున్నా 100 నంబరుకు ఫోను చేసి ఫిర్యాదు చేయవచ్చునని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు
ఇదీ చూడండి: రద్దయిన రైలు టికెట్లకు పూర్తి రీఫండ్