ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. కరోనా సోకిందనే భయంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడని బంధువులు చెబుతున్నారు. కంచికచర్లకు చెందిన శ్రీనివాసరావు జ్వరం రావటంతో స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. తరువాత విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సలహాపై శ్రీనివాసరావు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షకు శాంపిల్ ఇచ్చి ఇంటికి వెళ్లాడు.
రాత్రంతా ఇంట్లోనే ఉన్న అతను ఈనెల 4 తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. వారం రోజుల నుంచి బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి : చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా?.. అయితే జాగ్రత్త!