కాంగ్రెస్ హాయాంలో తెచ్చిన పోడు భూముల చట్టాన్ని అమలుచేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. గిరిజనుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి భాజపాలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న వార్తలను మల్లు రవి ఖండించారు. భాజపాకు ఇతర పార్టీల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని విమర్శించారు. తెరాసకు బీజేపి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి 12మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరితే తప్పని చెప్పిన కమలం నేతలు ఏపీలో నలుగురు ఎంపీలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ భవిష్యత్ కోసమే రాజీనామా:రాహుల్