రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు... కేంద్రప్రభుత్వం కుట్రకు పూనుకుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు వబ్బతి శ్రీ కృష్ణ ఆరోపించారు. ఈ కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
రిజర్వేషన్లపై కేంద్రప్రభుత్వం కుట్రలు అనే అంశంపై మాల మహానాడు ఆధ్వర్యంలో... హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఆయా సంఘాల ప్రజా ప్రతినిధులు సంఘటితంగా కృషిచేయాలని కోరారు.
ఇదీ చదవండి: రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ