ETV Bharat / state

'కుల సంఘాల వ్యవహారాల్లో రాజకీయనేతల జోక్యమెందుకు?' - mala mahanadu national president chennaiah

హైదరాబాద్​ ట్యాంక్​బండ్​ అంబేడ్కర్​ విగ్రహం ముందు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య నిరసన తెలిపాడు. ఆంధ్రప్రదేశ్​ శ్రీశైలంలోని మాలమహానాడు కార్యాలయానికి పోలీసులు తాళం వేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కార్యాలయానికి వేసిన తాళాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్​ చేశారు.

'రాజకీయనేతలకు కుల సంఘాల వ్యవహారాల్లో జోక్యమెందుకు?'

author img

By

Published : Jul 3, 2020, 4:24 PM IST

ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలోని మాల మహానాడు కార్యాలయానికి పోలీసులు అకారణంగా తాళాలు వేయడాన్ని ఆ కమిటీ జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తప్పుపట్టారు. స్థానిక ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించారని ఆరోపించారు. శ్రీశైలం పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా... హైదరాబాద్ ట్యాంక్​బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు చెన్నయ్య నిరసన చేపట్టారు.

23 ఏళ్లుగా మాల మహానాడు కమిటీ ఈ కార్యాలయాన్ని నిర్వహిస్తోందని... ఇప్పుడు కమిటీలో వచ్చిన చిన్నపాటి తగాదాలు ఆసరాగా చేసుకుని కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొనే కుట్ర జరుగుతోందని చెన్నయ్య ఆరోపించారు. రాజకీయ నాయకులకు కుల సంఘాల వ్యవహారాల్లో జోక్యం ఎందుకని చెన్నయ్య ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు వేసిన తాళాలు తొలగించి కార్యాలయాన్ని కమిటీ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.