ETV Bharat / state

Assembly Sessions 2021: పర్యాటకులు అసౌకర్యం కల్పిస్తే జైలు, జరిమానా

ప్రయాణికులకు, పర్యాటకులకు అసౌకర్యం కల్పించే వారిపై చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. పర్యాటకులకు, ప్రయాణికులకు సురక్షితమైన ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడటమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

Assembly Sessions 2021
హోం మంత్రి మహమూద్ అలీ
author img

By

Published : Oct 1, 2021, 1:16 PM IST

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, విమానాశ్రయ ఆవరణలు, ఇతర ప్రాంతాల్లో పర్యాటకుల పట్ల దుష్ప్రవర్తన, దళారీతనాన్ని అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును హోం మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రయాణికులకు ఎదురయ్యే సమస్యలు, సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును రూపొందించారు.

పర్యాటకులకు, ప్రయాణికులకు సురక్షితమైన ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడటమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. తమ సేవలు తొందరపెట్టడం, ప్రలోభపెట్టడం, సైగలు, ప్రకటల రూపంలో ఉండవని... ప్రయాణికులకు, పర్యాటకులకు అసౌకర్యం కల్పించే వారిపై చర్యలు తీసుకునేందుకే ఈ బిల్లును రూపొందించామన్నారు. సాధారణంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా ఏడాది వరకు జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ బిల్లు ద్వారా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి తగు చర్యలు తీసుకోవచ్చు.

ఇదీ చూడండి: KCR Speech in Assembly 2021: ఏకగ్రీవ పంచాయతీలకు నిధులిస్తమని మేమెప్పుడు చెప్పినం: కేసీఆర్

Seethakka in Assembly sessions 2021: 'ప్రజా గొంతుకలను కట్‌ చేయడమే మీ లక్ష్యమా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.