ETV Bharat / state

Low Temperatures in Telangana: రాష్ట్రం గజగజ.. బయటకొచ్చేందుకు జంకుతున్న ప్రజలు - రాష్ట్రంలో చలిపులి పంజా

Low Temperatures in Telangana: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు వణికిపోతున్నారు. సాయంత్రం అయ్యిందంటే ఇంటి నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఆకాశం నిర్మలంగా ఉండటంతో రాత్రిపూట త్వరగా చల్లబడి శీతలగాలులు వీస్తున్నాయి

Low Temperatures in Telangana: రాష్ట్రం గజగజ.. బయటకొచ్చేందుకు జంకుతున్న ప్రజలు

author img

By

Published : Jan 31, 2022, 6:01 AM IST

Low Temperatures in Telangana: రాష్ట్రంలో ఆకాశం నిర్మలంగా ఉండటంతో రాత్రిపూట త్వరగా చల్లబడి శీతలగాలులు వీస్తున్నాయి. దట్టమైన మేఘాలుంటే భూ వాతావరణం ఎక్కువగా చల్లబడదు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుండటంతో ఆదిలాబాద్‌, నిర్మల్‌ తదితర జిల్లాల్లో రాత్రిపూట 5 నుంచి 10 డిగ్రీల వరకే ఉష్ణోగ్రత ఉంటోంది. రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆదివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌ జిల్లా అర్లి(టి)లో 5.7 డిగ్రీలు, హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌లలో 9.7 డిగ్రీలు నమోదైంది. నగర శివారులో 10 డిగ్రీలకన్నా తక్కువగా నమోదవడం ఈ నెలలో ఇదే తొలిసారి. గత పదేళ్ల కాలంలో జనవరి నెలలో హైదరాబాద్‌ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత 2012 జనవరి 15న 8.4 డిగ్రీలుగా వాతావరణ శాఖ రికార్డుల్లో ఉంది.

సాధారణం కన్నా 5 డిగ్రీలు తక్కువైతే శీతలగాలులు..

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తక్కువగా ఉంటోంది. సాధారణం కన్నా 5 డిగ్రీలు తక్కువగా, 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదైతే ఆ ప్రాంతంలో శీతలగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో రాత్రి సమయంలో ఇలాంటి పరిస్థితులే ఉండటంతో శీతలగాలులు వీస్తున్నట్లు హెచ్చరికలు జారీచేసింది. మంగళవారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని అంచనా.

చింతపల్లిలో 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత

ఏపీలోని విశాఖ మన్యంలో మళ్లీ రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో ఆదివారం ఉదయం 4.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.