లంబాడీల సంస్కృతి సంప్రదాయాలను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించే వరకు బంజారా సినిమాను విడుదల చేయవద్దంటూ సెన్సార్ బోర్డుకు జాతీయ బంజారా మిషన్ ఇండియా లంబాడీ హక్కుల పోరాట కమిటీ నాయకులు విన్నవించారు.
హైదరాబాద్ కవాడిగూడలోని కేంద్ర సెన్సార్ బోర్డుకు వచ్చిన ఆ సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యాలయంలోకి అనుమతించేది లేదని మెుదటగా పోలీసులు తెలిపారు. అనంతరం ఓ ప్రతినిధి బృందం కార్యాలయంలోకి వెళ్లి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించే వరకు సినిమాను విడుదల చేయరాదని వారు కోరారు.
ఇవీ చూడండి: 3 వేలు దాటిన కరోనా మరణాలు- మరిన్ని దేశాలకు విస్తరణ