ETV Bharat / state

దేశంలో 60శాతం పెరిగిన చిరుత పులులు - leopards increased in india

దట్టమైన ఆడవుల్లో.. వేలాది వన్యప్రాణులకు రారాజులుగా రాజరిక హోదాలో ఉన్న జీవులు పులులకు, సింహాలు మాత్రమే. ప్రకృతిధర్మాన్ని అనుసరించి ఇవి సాగించే వేట చూస్తే.. ఎవరికైనా ఓ వైపు భయం, మరోవైపు ఆశ్చర్యం కలగగ మానదు. అంతటి బలమైన అటవీ మృగాలు సైతం.. అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అందుకు మానవుల స్వార్థమే కారణం. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉన్న చిరుతలు, పులులు సింహాలు రానురాను వేలకు, వందలకు చేరుకోవడానికి కారణం కచ్చితంగా మనిషే. కానీ.. ప్రభుత్వాల సంరక్షణా చర్యల ఫలితంగా భారత్‌లో చిరుతల సంఖ్య2014తో పోల్చితే 2018 నాటికి 60%పెరిగాయని.. భారత్‌లో పులులు- 2018 నివేదిక స్పష్టం చేసింది. దీనిని కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేయగా.. ఇందులోని అంశాలు జంతు ప్రేమికులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

దేశంలో 60శాతం పెరిగిన చిరుత పులులు
దేశంలో 60శాతం పెరిగిన చిరుత పులులు
author img

By

Published : Dec 24, 2020, 1:10 PM IST

దేశంలో 60శాతం పెరిగిన చిరుత పులులు

ఈ భూమిపై జీవించేందుకు మానవుడికి ఎంత హక్కు ఉందో... మిగతా జంతువులకు అంతే హక్కు ఉంటుంది. కానీ ఇతరజీవులకు భిన్నంగా అపరిమిత ఆలోచన, తెలివితేటలు సంపాదించిన మనిషి.. అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాడు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించు కునేందుకు బదులు.. విచ్చలవిడిగా పాడుచేస్తున్నాయి. ఈ క్రమంలోనే అటవీ జంతువులకు ఎంతో హాని కలిగిస్తున్నాడు. వాటి ఆవాసాల్లోకి బలవంతంగా చొచ్చుకుపోతూ.. వాటి జీవనాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాడు. సరికదా.. తన దర్జా, హోదాలు ప్రకటించుకునేందుకు చిరుతలు, సింహాలను ఇష్టారీతిన వేటాడుతూ... క్రూరమృగాలను మించిపోయాడు. ఫలితంగా.... చిరుతలు, సింహాల సంఖ్య అంతరించిపోయో దశకు చేరుకుంటోంది.

భారత్​లో పెరిగిన చిరుతలు

అంతర్జాతీయంగానూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌- డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ నివేదిక ప్రకారం 20వ శతాబ్దం నుంచీ ఇప్పటివరకూ అంతర్జాతీయంగా దాదాపు 95% పైగా పులులు అంతరించిపోయాయి. ముఖ్యంగా వందేళ్ల కిందట వరకూ భూమిపై లక్షకు పైగా పులులు సంచరిచేవి. ప్రస్తుతం వాటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా ఆసియాలో పులులను తీవ్రంగా వేటాడుతున్నారు. భారత్‌లోనూ చిరుతలు, మిగతా వన్యప్రాణులను విచక్షణారహితంగా అంతమొందిస్తున్నారు. ఈ కారణంగా.. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని, ఫలితంగా మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అప్రమత్తమైన ప్రభుత్వాలు పటిష్ఠ సంరక్షణ చర్యలు చేపట్టడంతో....భారత్‌లో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ప్రకటించింది. 2018 వన్యప్రాణులు జనగణనా ఆధారంగా ఈ విషయం వెల్లడిస్తున్నట్లు తెలిపింది.

నాలుగేళ్లకు ఓసారి జంతుగణన

దేశంలో ప్రతి నాలుగేళ్లకు ఓ సారి జంతుగణన జరుపుతోంది.. కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే 2018లో చేపట్టిన సర్వే వివరాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి జావడేకర్‌ విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో చిరుతల పులుల సం‌ఖ్య క్రమంగా పెరుగుతుంది అన్న మంత్రి.. 2014లో 8 వేల చిరుత పులులు మాత్రమే ఉండగా... ప్రస్తుతం వీటి సంఖ్య 12 వేల 852 గా తేలిందని వివరించారు. నాలుగేళ్ల కాలంలోనే ఇంత భారీ సంఖ్యలో చిరుతల సంఖ్య పెరగడం సంతోషకరమన్న మంత్రి... 2014తో పోల్చితే చిరుత పులుల్లో పెరుగుదల 60శాతం మేర ఉందన్నారు. చిరుతలతో పాటే దేశంలో పెద్దపులులు, సింహాల సంఖ్యలో కూడా గణనీయమైన పెరిగినట్లు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ పట్ల కేంద్రం తీసుకుంటున్న చర్యలు...చిరుత పులుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయని జావడేకర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

అధిక భాగం మధ్యప్రదేశ్​లో

ప్రస్తుతం దేశంలోని 12 వేల 852 చిరుతల్లో అధిక భాగం మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. అక్కడి అడవుల్లో 3 వేల 421 చిరుతలు నివసిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. తర్వాత స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నట్లు తెలిపారు. కర్ణాటకలోని అడవుల్లో 17 వందల 83 చిరుతల్ని గుర్తించగా... మహారాష్ట్రలో 16 వందల 90 చిరుతలను గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది. ప్రాంతాల వారిగా విశ్లేషిస్తే... 8 వేల 71 చిరుతలు తూర్పు కనుమలు, మధ్య భారత్‌లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. పశ్చిమ కనుమలు విస్తరించిన రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, గోవా, కేరళల్లో మొత్తంగా 3 వేల 387 చిరుత పులులు సంచరిస్తున్నట్లు పర్యావరణశాఖ వెల్లడించింది. శివాలిక్‌ గంగా నది మైదానాల్లోని అడవులు.. 12 వందల 53 చిరుతలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలోనే అతితక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో 141 చిరుతలు మాత్రమే ఉన్నట్లు నివేదిక తెలిపింది.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

దేశంలో పెద్దపులుల సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతోంది. దేశంలోని వివిధ సంరక్షణ కేంద్రాలు, అడవుల్లో వీటి సంతతిలో స్పష్టమైన పెరుగుదల నమోదవుతోంది. 2006లో భారత్‌లో పులుల సంఖ్య 1 వెయ్యి 411గా ఉండగా....2010 నాటికి 1 వేయ్యి 706 కి, 2014 నాటికి 2,226కు చేరుకున్నాయి. 2018కి వచ్చే సమయానికి వీటి సంఖ్య 2 వేల 967కు చేరుకున్నాయి. 2014 నుంచి 18 మధ్య నాలుగేళ్ల కాలంలో పులుల సంఖ్య 700 లకి పైగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3 వేల పులులు ఉన్నాయని అంచనా. భారత్‌ పులులకు అతిపెద్ద, సురక్షిత నివాస ప్రాంతాల్లో ఒకటని గతేడాది అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రపంచం లోని మొత్తం పులుల్లో దాదాపు 70% భారత్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత పులుల సంఖ్య 2022లోగా రెట్టింపు చేయాలని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో లక్ష్యంగా నిర్ణయించగా.. దానిని భారత్‌ 2018 నాటికే అందుకుందని గుర్తుచేశారు. కాగా.. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2018 లెక్కలు... ప్రపంచంలోనే కెమేరా సహాయంతో చేపట్టిన భారీ వన్యప్రాణి గణనగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాయి.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పులుల సంఖ్యలో కూడా మంచి ఫలితాలే లభించాయి. దేశంలో పులుల సంరక్షణ కోసం.. 2006లో ఏర్పాటైన జాతీయ పులుల సంరక్షణా ప్రాధికార సంస్థ- ఎన్‌టీసీఏ... నిర్వహించిన గణన ప్రకారం... 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 68పులులు ఉండగా 2018 నాటికి వీటి సంఖ్య 74కు చేరుకుంది. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నాయి. దేశం లోని అతిపెద్ద అభయారణ్యాల్లో ఒకటైన నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంలో అత్యధిక పులులను గుర్తించగా, తెలంగాణలో కవ్వాల్, ఆమ్రాబాద్ రెండు అభయారణ్యాలలోనూ పులుల జాడను గుర్తించారు.

వన్యప్రాణి సంరక్షణకు, జీవవైవిధ్యతకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు.. కొన్నేళ్లుగా పులులు, చిరుతలు, సింహాల సంఖ్య పెరుగుదలే నిదర్శనం అని పర్యావరణ శాఖ మంత్రి జావడేకర్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: మన్యం కొండ అటవీ ప్రాంతంలో ఏడు చిరుతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.