ETV Bharat / state

'కరోనా బాధితులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందండి'

author img

By

Published : Aug 28, 2020, 1:41 PM IST

కరోనా బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డుల్లో చికిత్స పొందాలని ఎల్బీనగర్ ఎమ్మెల్సే సుధీర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఏరియా ఆస్పత్రిలోని కరోనా వార్డును పరిశీలించారు.

lb nagar mla sudheer reddy visited covid ward in vanasthalipuram  area hospital
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్​ వార్డును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సందర్శించారు. 20 పడకలతో ప్రారంభించిన ఈ వార్డులో కరోనా బాధితులకు చికిత్స అందించడానికి కావాల్సిన అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి దోపిడికి గురికాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్​లో చికిత్స పొందాలని సూచించారు.

అనంతరం ఆస్పత్రిలో ఉన్న సమస్యలను సూపరింటెండెంట్, ఆర్​ఎమ్​ఓలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్​తో చర్చించి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి కావాల్సిన అన్ని పరికరాలు, వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.