కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజల్లో అవగాహన కల్పించారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని బస్సుల్లో, బస్టాండ్ ఆవరణలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
ప్రజలను చైతన్యపరిచేందుకు మాస్కు ధరించి అవగాహన కల్పించారు. జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని కోరారు. రేపు ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని సూచించారు.
- ఇదీ చూడండి: చైనాలో మూడో రోజూ కరోనా కేసులు సున్నా