న్యాయపరమైన అంశాలపై సామాన్యులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పుల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రదర్శనలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
సామాజిక, న్యాయపరమైన, రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శనలో ఉంచారు. సుప్రీం కోర్టు నమూనాతో ఏర్పాటు చేసిన ముఖద్వారం ఆకట్టుకుంది.