ధరణి పోర్టల్ కోసం వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 79 లక్షలకు పైగా ఆస్తుల వివరాలను నమోదు చేశారు. జీహెచ్ఎంసీలో ఐదు లక్షలా 60 వేలు, ఇతర పట్టణాల్లో 16 లక్షలా 11వేలు, గ్రామపంచాయతీల్లో 57 లక్షలా 33 వేల ఆస్తుల వివరాలు నమోదు చేశారు.
మొత్తంగా 79 లక్షలకు పైగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తైంది. దాదాపుగా 80 శాతానికి పైగా ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయిందని అధికారులు అంటున్నారు. వర్షాల నేపథ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ జరగడం లేదు. అయితే వెబ్ పోర్టల్, మీసేవ ద్వారా కొంతమంది స్వయంగా ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ధరణి సాఫ్ట్‌వేర్‌లో మాక్ డ్రైవ్ రిజిస్ట్రేషన్లు