ETV Bharat / state

Darbhanga blast: దర్భంగా పేలుడు వెనక లష్కరే తోయిబా! - telangana varthalu

స్థానికంగా దొరికిన రసాయనాలతో ఐఈడీ లిక్విడ్ తయారీ... సీసాను బట్టల మధ్య పెట్టి ప్యాకింగ్.... ధైర్యంగా క్యాబ్​లో సికింద్రాబాద్​ పార్శిల్ కౌంటర్ వద్ద దర్భంగా ఎక్స్​ప్రెస్​కి పార్శిల్.... నగరంలో ఇంత పక్కాగా కదిలే రైలులో బ్లాస్ట్​కు పథకం రచించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అరెస్ట్ చేసింది. హైదరాబాద్​కు చెందిన వీరికి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. నేడు వీరిని కోర్టులో హాజరు పరిచి లోతుగా దర్యాప్త చేసేందుకు కస్టడీలోకి తీసుకోనున్నారు.

Darbhanga blast: దర్భంగా పేలుడు వెనుక లష్కరే తోయిబా!

author img

By

Published : Jul 1, 2021, 2:21 AM IST

గత నెల 17న బిహార్​లోని దర్భంగా రైల్వేస్టేషన్​లోని ఒకటో నంబర్ ప్లాట్​ఫాంపై వస్త్రాల పార్శిల్​లో జరిగిన బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. హైదరాబాద్ నాంపల్లిలో నివాసం ఉంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ నజీర్ ఖాన్ అలియాస్ నాసిర్​ మాలిక్ పేలుళ్లలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పార్శిల్ కౌంటర్ వద్ద నిందితులు సూపియాన్ అనే పేరుతో ఓ పాన్ కార్డు ప్రతిని సమర్పించారు. పేలుడు తర్వాత దర్భంగా జీఆర్పీ సహకారంతో దర్యాప్తు చేసిన ఎన్ఐఏ పార్శిల్ కౌంటర్ వద్ద ఇచ్చిన ఫోన్ నంబర్​పై దృష్టి సారించారు.

పక్కా సమాచారంతో..

సికింద్రాబాద్ నుంచి దర్భంగాకు తరచుగా వస్తువులు వస్తూనే ఉంటాయి. కాని దుస్తులు రావడం ఇదే మొదటిసారి. పైగా అసలు ఇక్కడ నుంచి దుస్తులు పంపాల్సిన అవసరం ఏముందనే దానిపై దృష్టి సారించారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం పంపి ఉంటే ఒకటి రెండు పంపుతారు. కాని అన్ని కిలోల దుస్తులు ఎందుకు పంపుతారు అనే అనుమానంతో పార్శిల్ కౌంటర్ వద్ద ఇచ్చిన ఫోన్ నంబర్​ను ట్రాక్ చేయగా ఆ నంబరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శామి జిల్లా జైరానాకు చెందిన వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. టవర్ లొకేషన్​లో హైదరాబాద్ ఆపరేట్ అవుతున్నట్లు తేల్చారు. పార్శిల్ పంపిన బట్టల దుకాణంలో ఆరా తీశారు. పక్క సమాచారంతో నాంపల్లికి చెందిన ఇమ్రాన్ మాలిక్, మహ్మద్ నజీర్ ఖాన్​ను అరెస్టు చేశారు. వీరు ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్​లో ఉంటున్నట్లు గుర్తించారు.

పాక్​ ఉగ్రవాదుల మార్గదర్శనం

పాక్ కేంద్రంగా లష్కరే తోయిబా భారత్​లో భారీగా ప్రాణ, ఆస్తినష్టం కలిగించేందుకు కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు తెలిపింది. ఇమ్రాన్ మాలిక్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ నజీర్ ఖాన్ అలియాస్ నాసిర్ మాలిక్ పేలుళ్లలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. నాసిర్​ 2012లో పాకిస్థాన్ వెళ్లి లష్కరే తోయిబా ఉగ్రవాదుల ద్వారా స్థానికంగా అందుబాటులో ఉండే రసాయన పదార్థాలతో ఐఈడీల తయారీలో శిక్షణ పొందినట్లు తెలిపింది. పేలుడుకు వాడిన సీసాలో ఐఈడీ రసాయనాన్ని నింపినట్లు గుర్తించిన ఎన్ఐఏ...దానిని ఫ్రీజింగ్ డైనమైట్ అయిన ఇథలీన్ గ్లైకాల్ డై నైట్రైట్​తో తయారు చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీన్ని బట్టల మధ్యలో పెడితే అనుమానం రాదని సుదూర ప్రాంతాలకు వెళ్లే రైలు సికింద్రాబాద్ దర్భంగా ఎక్స్​ప్రెస్​ను ఎంచుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. నాసిర్, ఇమ్రాన్​లను నేడు నాంపల్లి కోర్టులో హాజరు పరిచి పట్నాకు తరలించనున్నారు. నిందితులిద్దరినీ లోతుగా ప్రశ్నించి భారీ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి: NIA: దర్భంగా పేలుడు కేసులో ఇద్దరు హైదరాబాదీల అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.