ETV Bharat / state

ప్రాణాలను హరిస్తోన్న భూ వివాదాలు.. పెరుగుతున్న నేరాల తీవ్రత - Telangana news

Land Disputes: రాష్ట్రంలో జరుగుతున్న హత్యల్లో కుటుంబ కలహాల తర్వాతి స్థానం భూ వివాదాలదే. రానురాను ఈ తరహా నేరాల తీవ్రత పెరిగిపోతోంది. భూవివాదాలతో తలెత్తిన పాతకక్షలే మంగళవారం శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Land
Land
author img

By

Published : Mar 2, 2022, 5:07 AM IST

Land Disputes: ఆకాశాన్నంటుతున్న భూముల ధరలు ప్రాణాలు హరిస్తున్నాయి. ఆస్తి దక్కించుకోవాలన్న స్వార్థం హత్యలను ప్రేరేపిస్తోంది. స్థలాల కోసం మొదలవుతున్న వివాదాలు బంధువులు, స్నేహితులనే కాదు... అడ్డొచ్చిన వారిని హతమార్చే కసిని రగులుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న హత్యల్లో కుటుంబ కలహాల తర్వాతి స్థానం భూ వివాదాలదే. రానురాను ఈ తరహా నేరాల తీవ్రత పెరిగిపోతోంది. భూవివాదాలతో తలెత్తిన పాతకక్షలే మంగళవారం శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలోని పోలీసుస్టేషన్లలో నిత్యం సగటున 140-160 ఫిర్యాదులు అందుతుంటాయి. రాజేంద్రనగర్‌, మాదాపూర్‌, ఎల్బీనగర్‌, భువనగిరి పోలీసు డివిజన్లలో 70-80 శాతం భూములకు సంబంధించిన అంశాలే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

పెరుగుతున్న ధరలే కారణం..

అనూహ్యంగా పెరుగుతున్న భూముల ధరలే హత్యలకు కారణమవుతున్నాయి. రాజధాని శివార్లలో ఇది మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు కారణాలపై పోలీసుశాఖ పరిశీలన చేసింది. గత ఏడాది జరిగిన మొత్తం హత్యల్లో కుటుంబ కలహాల వాటా 48 శాతం కాగా భూవివాదాలది 17 శాతం. రాజధానిలో స్థిరాస్తి మాఫియా తీరు వేగంగా మారుతోంది. ఇంబ్రహీంపట్నంలో మంగళవారం జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ జంట హత్యలు జరిగిన తీరును పరిశీలించిన అధికారులు సుపారీ ముఠా పనిగానే అనుమానిస్తున్నారు.

ఖాకీ, ఖద్దరు కనుసన్నల్లో దందాలు..

పోలీసులు, రాజకీయ నాయకుల సహకారం ఉంటే దందాలు చేయొచ్చు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చు. ఇది రియల్‌ వ్యాపారం వెనుక అక్రమార్కుల ఆలోచన. భూ వివాదాల్లో తలదూర్చి ఆధిపత్యం సాధించేందుకు ఎంతకైనా తెగించేలా చేస్తోంది. హైదరాబాద్‌ జిల్లాలో సర్కారు స్థలం 80 ఎకరాలుంటే.. దానిపై న్యాయస్థానాల్లో 2,493 కేసులున్నాయి. నగర శివారు ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, భువనగిరి, ఇబ్రహీంపట్నం, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, బాచుపల్లి, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వేల కేసులు నమోదవుతున్నాయి. దశాబ్దాల నాటి భూములు కావటంతో అసలు యజమానులు ఎవరనేది గుర్తించటం కష్టంగా మారింది. రికార్డులు కూడా సరిగా లేకపోవటంతో కొందరు రియల్‌ వ్యాపారులు, రౌడీషీటర్లు, ప్రజాప్రతినిధులు వాటిపై కన్నేసి బోర్డులు పాతేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా విభజించి అమ్మేస్తున్నారు. ఒకే స్థలానికి పలు రిజిస్ట్రేషన్లు చేయిస్తూ వివాదాస్పదం చేస్తుంటారు. ఇరువర్గాలకు రాజీ కుదిర్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేసి ధర నిర్ణయిస్తారు. లాభాల్లో వాటాలు పంచుకుంటారు.

రూ.వందల కోట్ల సెటిల్‌మెంట్లు..

సైబరాబాద్‌ పరిధిలోని పోలీసు డివిజన్‌. అక్కడ భూ వివాదాలు ఖాకీలకు కాసుల పంట కురిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి రూ.వందల కోట్ల విలువైన భూ వివాదాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మూడేళ్లగా ఒకే ఠాణాలో పనిచేస్తున్న ఎస్సైని బినామీగా మార్చిన ఓ ఏసీపీ వివాదాస్పద భూములను తక్కువ ధరకు దక్కించుకుని భారీ లాభాలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనూ ఓ ఏసీపీ రియల్‌ వ్యాపారులకు కొమ్ము కాస్తూ భూ పంచాయితీలు చేస్తున్నట్టు సమాచారం. బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గతంలో ఎల్బీనగర్‌ డివిజన్‌లో పనిచేసిన ఇద్దరు ఏసీపీలు భూ వివాదాల్లో తలదూర్చి బదిలీ వేటుకు గురయ్యారు. తాజాగా పేట్‌బషీర్‌బాద్‌లో జరిగిన కిడ్నాప్‌ డ్రామా వెనుక భూ వివాదాలు కారణమనే ఆరోపణలున్నాయి. గతంలో పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారి కనుసన్నల్లో కోట్ల రూపాయల భూ దందా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి: పక్కాప్లాన్​.. పాయింట్ బ్లాంక్ రేంజ్​లో ఫైరింగ్.. హైదరాబాద్ రియల్టీల హత్యకేసులో విస్తుపోయే నిజాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.