ప్రజలు, వారి అవసరాల కేంద్రంగా తెలంగాణ పాలన కొనసాగుతోందని మాజీ సీఎస్ జోషి అన్నారు. ఆయన తన అనుభావాలతో 'ఎకో టీ కాలింగ్' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను పుస్తకంలో పేర్కొనడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఉందన్నారు. తక్కువ కాలంలోనే మంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన జోషికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.
ఇదీ చూడండి : సీఐ ఇంట్లో రూ.3 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా