ETV Bharat / state

దేశంలోని రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకు?: కేటీఆర్‌ - సింగరేణి బొగ్గు గనులను వేలం వేయనున్న కేంద్రం

KTR Tweet On Singareni Coal Mines: సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకణ చేయడంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఒకే దేశంలోని రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో గనులను వేలం జాబితా నుంచి తొలగించినట్లు ఓ ఆంగ్ల వార్తా పత్రిక రాసిన వార్తను.. ట్వీట్‌కు జత చేశారు.

ktr
ktr
author img

By

Published : Apr 8, 2023, 9:50 PM IST

KTR Tweet On Singareni Coal Mines: తెలంగాణలోని నాలుగు బొగ్గు గనులను వేలం జాబితా నుంచి తొలగించి.. ఆ గనులను సింగరేణి కాలరీస్‌ సంస్థకు నేరుగా కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ మరోసారి డిమాండ్‌ చేశారు. తమిళనాడుకు చెందిన మూడు లిగ్నైట్‌ గనులను వేలం నుంచి తొలగించిన నేపథ్యంలో ట్విటర్‌ ద్వారా ఆయన స్పందించారు. సింగరేణి కాలరీస్‌ కోసం తాము కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు తెలియజేశామన్నారు. ఒకే దేశంలోని రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు.

అదే విధంగా ఆ నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా.. సింగరేణి కాలరీస్‌కే కేటాయించాలని కేటీఆర్​ అన్నారు. తమిళనాడు గనులను వేలం జాబితా నుంచి తొలగించినట్లు ఓ ఆంగ్ర పత్రిక రాసిన వార్తను.. ట్వీట్‌కు జత చేశారు. దేశంలోని తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లోని 101 బొగ్గు గనులను వేలం వేయడానికి.. కేంద్ర ప్రభుత్వం గత నెల 29న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలు ఏవైనా సరే ఈ వేలంలో టెండర్లు దాఖలు చేసుకోవచ్చని.. ఈ విధంగా బొగ్గు గనులు సొంతం చేసుకోవాల్సిందేనని అందులో స్పష్టం చేసింది.

కేంద్ర జారీ చేసిన నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రానికే లాభదాయకమైన.. దేశంలోనే అత్యధిక లాభాలను ఇచ్చే బొగ్గు గనిని రాష్ట్ర ప్రభుత్వానికే కేటాయించాలని డిమాండ్‌ చేస్తోంది. గత నెల 29న కేంద్రం.. బొగ్గు గనులను వేలం వేయడానికి నోటిఫికేషన్​ జారీ చేసింది. వీటిపై ఈ నెల 12న ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహిస్తామని తేలిపింది. ఈ గనులను దక్కించుకునేందుకు ఆసక్తి గల ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలు హాజరై టెండరు ప్రక్రియ తెలుసుకోవాలని కేంద్ర బొగ్గుశాఖ తాజాగా మరో నోటిఫికేషన్‌ ఇచ్చింది.

  • This👇is exactly what we have been demanding & protested even today for Singareni Collieries

    That 4 Coal mines of Telangana be removed from auction list & allocated Directly to SCCL

    Why different rules for different states in the same country? #Singareni pic.twitter.com/0rOtdVKle8

    — KTR (@KTRBRS) April 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దీంతో తాజాగా సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయవద్దని.. కేంద్ర బొగ్గుశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌కు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ మహాధర్నాను చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్‌ కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.