ETV Bharat / state

ఇది అమాయక కర్ణాటక కాదు - తెలివైన తెలంగాణ : కేటీఆర్​ - కేటీఆర్ కామెంట్స్ ఆన్​ కర్ణాటక సీఎం

KTR Tweet On Karnataka CM Siddaramaiah : కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్​ ఎక్స్ వేదికగా స్పందించారు. పదేళ్లలో తెలంగాణలోని ఆదిలాబాద్​ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం ఏర్పరచుకున్న సర్కార్ బీఆర్ఎస్​ అయితే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం కర్ణాటకది అని విమర్శించారు.

Siddaramaiah Comments on KCR Government
KTR Fires On Karnataka CM Siddaramaiah
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 9:21 AM IST

KTR Tweet On Karnataka CM Siddaramaiah : కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలపై.. బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్​ పార్టీది 5 గంటల ఫెయిల్యూర్ మోడల్​ అయితే తెలంగాణలో బీఆర్​ఎస్​ది 24 గంటల పవర్​ఫుల్ మోడల్ అన్నారు. కేసీఆర్​ అధికారంలోకి వచ్చిన పదేళ్ల ప్రస్థానం తర్వాత ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పాలన కేసీఆర్​ ప్రభుత్వానిదని.. అధికారం చేపట్టి 6 నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం కర్ణాటకదని విమర్శించారు.

KTR Fires On Karnataka CM Siddaramaiah : ఎన్నికల్లో ఇచ్చిన.. ఐదు హామీలకు పాతరేసి.. నమ్మి ఓటేసిన ప్రజల్ని గాలికొదిలేసి.. తెలంగాణకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక కర్ణాటక కాదని.. తెలివైన తెలంగాణ అని కేటీఆర్​ దీటుగా బదులిచ్చారు. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణకు వచ్చి డిక్లరేషన్లు ఇస్తే విశ్వసించేదెవరని కేటీఆర్​ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే.. ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని ధ్వజమెత్తారు. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే.. కాంగ్రెస్ సర్కారును సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నమ్మి మోసం చేసినందుకు వారికి సరైన గుణపాఠం చెప్పడం తథ్యమని కేటీఆర్‌ ట్వీట్​లో పేర్కొన్నారు.

KTR Comments on Revanth Reddy : "కొడంగల్‌లో నరేందర్​రెడ్డిపై గెలవని రేవంత్‌రెడ్డి... కేసీఆర్​పై గెలుస్తారా..?"

CM Siddaramaiah Speech at Kamareddy : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కామారెడ్డిలో జరిగిన సభలో పాల్గొని.. బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ​ అదేవిధంగా బీసీ డిక్లరేషన్​ను ప్రకటించారు. అనంతరం కామారెడ్డి బీఆర్​ఎస్​ అభ్యర్థి అయిన కేసీఆర్​పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. రేవంత్​ను ఓడించేందుకు సీఎం కేసీఆర్​ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్​ పదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలను బీఆర్​ఎస్​ను ఓడించాలని నిర్ణయించుకున్నారని జోస్యం చెప్పారు.

'సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం'

Siddaramaiah Comments on KCR Government : ప్రజలు కేసీఆర్​ను ఓటు ద్వారా ఇంటికి పంపాలనుకుంటున్నారని.. ఆ రోజు కోసమే వేచి చూస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచి అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని స్పష్టం చేశారు. కేసీఆర్​ గ్యారెంటీలను అమలు చేయలేదని అంటున్నారని.. కర్ణాటక వచ్చి చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు మోదీ ఎన్నిసార్లు వచ్చినా బీజేపీ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు.

గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే - అందుకే హ్యాట్రిక్​పై అంత ధీమాగా ఉన్నాం : మంత్రి కేటీఆర్

మైనారిటీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి : మంత్రి కేటీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.