ETV Bharat / state

KTR Review on Greater Warangal : 'వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అదనంగా రూ.250కోట్లు విడుదల' - Development Programmes in Warangal

KTR Review on Greater Warangal : శాసనసభ కాన్ఫెరెన్స్‌ హాల్లో మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్​పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్​ మున్సిపల్​ కార్పోరేషన్​కి అదనంగా రూ.250కోట్లు ప్రత్యేక నిధులను విడుదల చేస్తారని తెలిపారు. దీంతో పాటు వరదల గురించి ఆరా తీసి.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మరలా రాకూడని అధికారులను ఆదేశించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 5, 2023, 9:44 PM IST

KTR Review Meeting with Warangal High Officials : గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అదనంగా టీయుఎఫ్‌ఐడీసీ ద్వారా మరో రూ.250కోట్ల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేస్తామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. ఈ నిధులతో నగర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించే అత్యంత కీలకమైన మౌలిక వసతులను కల్పించాలని మంత్రి కోరారు. శాసనసభ కాన్ఫరెన్స్‌ హాల్​లో మంత్రి కేటీఆర్.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

KTR Instructions to Officials : వరంగల్ నగరానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ పనుల పురోగతి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి నగర అభివృద్ధి కోసం మద్దతు అందిస్తుందని మంత్రి తెలిపారు. నగరంలో ఈ మధ్య వచ్చిన వరద సమస్యపైన ప్రత్యేకంగా సమావేశంలో చర్చించారు. భారీ వరదల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన.. దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వరద నివారణలో భాగంగా నాలాల అభివృద్ధి.. నాలాల పైన ఉన్న అడ్డంకుల తొలగింపును వెంటనే చేపట్టాలని ఆదేశించారు.

KTR Review Meeting with High Officials : 'సహాయక చర్యలు సవాలుగా స్వీకరించి.. ముందుకు సాగాలి'

KTR Review on Warangal Floods Problems : నాలాలను కబ్జాల వెంటనే తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని.. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గవద్దని అధికారులకు కేటీఆర్ స్పష్టం చేశారు. కబ్జాల తొలగింపు విషయంలో పేద ప్రజలను ఒప్పించి, వేగంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. భవిష్యత్తు వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నామనే విషయం తెలియజేయాలని పేర్కొన్నారు. వరంగల్ వరదలను అరికట్టేందుకు హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేసిన ఎస్​ఎన్​డీపీ కార్యక్రమం మాదిరి ఒక ప్రత్యేక కార్యచరణ తీసుకోవాలని మంత్రిని ప్రజాప్రతినిధులు కోరారు. హైదరాబాద్​లో చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా.. గతంలో మాదిరే ఈసారి కూడా అదే స్థాయిలో వర్షం పడినా.. హైదరాబాద్ ప్రజలకు వరదల నుంచి ఎంతో ఉపశమనం కలిగిందని అన్నారు. ఇదే తీరుగా వరంగల్ నగరానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

Development Programmes in Warangal : అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. వెంటనే ఇలాంటి ఒక ప్రత్యేక నాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఒకదాన్ని ఏర్పాటు చేసి అవసరమైన కార్యాచరణను చేయాలని పురపాలక శాఖ ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశించారు. వరంగల్ నగరంలో సుదీర్ఘకాలం పెండింగ్​లో ఉన్న కాళోజీ ఆడిటోరియం వంటి అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యం పైన ఆరా తీశారు. వాటిని వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైతే ఎక్కువ సిబ్బందిని పెట్టి, అధిక షిఫ్టుల్లో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని.. ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్న మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

KTR Instructions to BRS Leaders : 'మెట్రో విస్తరణ నియోజక వర్గాల్లో సంబరాలు నిర్వహించాలి'

KTR on Telangana IT Development : 'తెలంగాణ వచ్చాక 6 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగాలొచ్చాయి'

KTR Speech at Assembly Sessions 2023 : 'సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత.. తప్పైతే వచ్చే ఎన్నికల్లో ఓడించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.