ETV Bharat / state

హైదరాబాద్ మాస్టర్ ప్లాన్​కు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగాలి: కేటీఆర్ - హైదరాబాద్​ రోడ్ల నిర్మాణంపై కేటీఆర్​ సమీక్ష

హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న నగర రోడ్ల నిర్మాణం, విస్తరణపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. జంటనగరాల్లో సాగుతున్న ఎస్సార్ డీపీ పనులకు సంబంధించి మంత్రి అధికారులతో చర్చించారు.

ktr review meeting Road widening in accordance with Hyderabad Master Plan
'హైదరాబాద్ మాస్టర్ ప్లాన్​కి అనుగుణంగా రోడ్ల విస్తరణ'
author img

By

Published : Jul 9, 2020, 8:26 PM IST

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్​కి అనుగుణంగా రోడ్ల విస్తరణ, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.

రోడ్ల నిర్మాణం, విస్తరణ

రోడ్లకు సంబంధించిన మైక్రో ప్లానింగ్ కోసం హైదరాబాద్ నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించాలన్నారు. ఒక్కో జోన్​పై ప్రస్తుతం ఉన్న రోడ్లతోపాటు భవిష్యత్తులో చేయాల్సిన రోడ్ల నిర్మాణం, విస్తరణ వంటి కార్యక్రమాలన్నింటిపై ఒక నివేదిక అందించాలని తెలిపారు. నివేదికలో ప్రస్తుతం ఉన్న రోడ్లతోపాటు భవిష్యత్తులో.. రోడ్లపైన ఏర్పడే జంక్షన్ల అభివృద్ధి, బస్​బేలు, టాయిలెట్ల నిర్మాణం వంటి అంశాలకు సంబంధించి సమాచారం ఉండాలన్నారు. నివేదిక తయారీ కోసం రోడ్డు నిర్మాణ కన్సల్టెంట్లు, సంస్థతో కలిసి పని చేసి నెలరోజుల్లోగా ఓ ప్రాథమిక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు.

మీడియన్ గ్రీనరీ ఉండేలా

హైదరాబాద్​లో ప్రస్తుతం ఉన్న ప్రతి వంద ఫీట్ల రోడ్డుపైన కచ్చితంగా ఒక మీడియన్ గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ లోకేశ్​ కుమార్​కు కేటీఆర్​ చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రిడ్, రేడియల్, మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు.

నూతన రోడ్ల నిర్మాణానికి సంబంధించి

మొదటి దశలో చేపట్టిన 23 లింకురోడ్ల నిర్మాణం ఈ నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన సీఆర్​ఎంపీ రోడ్ల నిర్వహణ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు మంత్రికి వెల్లడించారు.

మొదటి దశ సీఆర్​ఎంపీకి సంబంధించిన రోడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తైందని, ఫుట్​పాత్​ల మీడియన్లు, శానిటేషన్ నిర్వహణ వంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. నూతన రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎస్​ఆర్​డీ, హెచ్​ఆర్​డీసీఎల్, సీఆర్​ఎంపీ కింద చేపడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత రోడ్లపైన జోనల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించి ఆదేశాలు జారీ చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్​కు తెలిపారు.

ఇదీ చూడండి : అగ్రరాజ్యం సైతం తెలంగాణపైనే ఆధార పడుతోంది: మంత్రి కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.