ETV Bharat / state

KTR Reacts to Modi Comments On BRS BJP Alliance : 'డిపాజిట్ రాని బీజేపీతో మాకు పొత్తా.. మేము పోరాడేవాళ్లమే తప్ప మోసంచేసే వాళ్లం కాదు'

KTR Reacts to Modi Comments On BRS BJP Alliance : నిజామాబాద్​ ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్రమోదీ బీఆర్ఎస్​ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మంత్రులు స్పందించారు. గతంలో బీఆర్ఎస్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని బీజేపీ చెప్పిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అలాగే తెలంగాణ ఆవిర్భావం తర్వాత తమతో పొత్తు కోసం ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయని.. తమ బాస్ కేసీఆర్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే ప్రధాని మోదీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలను నమ్మరని తేల్చి చెప్పారు.

KTR Fires On PM Modi Nizamabad Comments
KTR Fires On PM Modi
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 11:11 AM IST

KTR Reacts to Modi Comments On BRS BJP Alliance : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమతో పొత్తు కోసం ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. తమ బాస్ కేసీఆర్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. విపక్షాలు మాత్రం కేసీఆర్‌ను ఓడించేందుకు ఒక్కటయ్యాయని ఆరోపించారు. విపక్షాలు సైద్ధాంతిక విభేదాలు పక్కనపెట్టి మరీ కలిసి పని చేశాయని విమర్శించారు. బీఆర్ఎస్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని బీజేపీ చెప్పిందని మంత్రి విరుచుకుపడ్డారు.

  • BRS has never allied with anyone during polls ever since Telangana was formed despite several requests -

    In fact it is the opposition that have come together setting aside their ideological differences to defeat the formidable KCR garu

    In 2018, Biggest Jhoota Party through its… pic.twitter.com/oqFZsr823C

    — KTR (@KTRBRS) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Tweet on PM Modi Nizamabad Comments : "అనేక అభ్యర్థనలు ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. నిజానికి బలీయుడైన కేసీఆర్‌ను ఓడించేందుకు సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చింది ప్రతిపక్షాలే. 2018లో, బిగ్గెస్ట్ ఝూటా పార్టీ దాని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ద్వారా బీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకోవడానికి ఫీలర్‌లను పంపింది. తన దిల్లీ అధికారుల ఆమోదం లేకుండానే ఈ ఆఫర్ వచ్చి ఉంటుందా. ఇదిగో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రకటన రికార్డ్. బీఆర్ఎస్ ఆఫర్ చేసిన మరుసటి నిమిషంలో దానిని పూర్తిగా తిరస్కరించింది. సొంతంగా ఏర్పడే బలం మనకున్నప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు ఎందుకు అవసరం." అని మంత్రి కేటీఆర్ ఎక్స్​(ట్విటర్)లో ట్వీట్ చేశారు.

KTR Anger Over PM Modi Comments in Nizamabad : కేసీఆర్ ఒక ఫైటర్‌... చీటర్‌తో కలవరు: మంత్రి కేటీఆర్‌

Talasani Srinivas Yadav Fires on PM Modi : నిజామాబాద్​ ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కేటీఆర్‌ సీఎం కావడానికి ప్రధాని అనుమతి అవసరం లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మోదీ మాట్లాడరని ఆరోపించారు. రాష్ట్రం హక్కుల గురించి మోదీ ఎందుకు మాట్లాడరని నిలదీశారు. ఎన్నికలు రాగానే మోదీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలను నమ్మరని మంత్రి తలసాని పేర్కొన్నారు.

ఇంతకీ మోదీ నిజామాబాద్ సభలో చేసిన కామెంట్స్ ఏంటంటే.. వచ్చే ఐదేళ్లు తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే.. బీఆర్​ఎస్​ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతానని మోదీ వెల్లడించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్​ వైఖరి పూర్తిగా మారిపోయిందన్నారు. కేసీఆర్​ దిల్లీ వచ్చి తనను కలిశారని.. తెలంగాణ పాలన పగ్గాలు కేటీఆర్​కు ఇస్తానన్నారని.. ఆయన ఆశీర్వదించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇది రాజరికం కాదని.. తాను కేసీఆర్​కు గట్టిగా చెప్పాను. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలో మద్దతివ్వాలని అడిగారని మోదీ తెలిపారు. విపక్షంలోనైనా కూర్చుంటాం కానీ, మద్దతు ఇవ్వనని తెగేసి చెప్పినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చెయ్యనని కేసీఆర్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు. కేసీఆర్‌ కోరినా.. బీఆర్​ఎస్ ఎన్డీయేలో చేరేందుకు నేను అంగీకరించలేదని ప్రధాని మోదీ చెప్పారు.

KTR Speech in Dharmapuri : 'కాళేశ్వరం కావాలా.. శనీశ్వరం లాంటి కాంగ్రెస్ కావాలా'

KTR Comments on PM Modi : 'రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.