ETV Bharat / state

'మోదీ, రాహుల్ సహా ఎవరికీ భయపడను' - muncipality elections news

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే.. కాంగ్రెస్ హయాంలో మున్సిపాల్టీలకు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సవాల్ విసిరారు. తనకు భాజపా అంటే భయమన్న లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్​లో తెరాస సోషల్ మీడియా బృందాలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

ktr
తెరాస భవన్​లో సోషల్ మీడియా బృందాలతో కేటీఆర్
author img

By

Published : Jan 13, 2020, 11:53 PM IST

కాంగ్రెస్ హయాంలో మున్సిపాల్టీలకు నిధులు ఎక్కువ విడుదల అయ్యాయంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు. 2004 నుంచి 2014 మధ్య విడుదల చేసిన నిధుల కన్నా.. గత ఐదేళ్లలో రెట్టింపు నిధులను విడుదల చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

600కి పైగా స్థానాల్లో అభ్యర్థులే లేరు..

తనకు భాజపా అంటే భయమని లక్ష్మణ్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 600కు పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలపలేకపోయినందుకు భయపడాలా లేక హుజూర్​నగర్​లో కారు గుర్తును పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థికి పోలైనన్ని ఓట్లు కూడా దక్కించుకోనందుకు ఆ పార్టీకి భయపడాలా అని ఎద్దేవా చేశారు.

ఎవరికీ భయపడను..

మోదీ, రాహుల్ సహా తాను ఎవరికీ భయపడనని... తన బాస్​లు దిల్లీలో లేరని.. తెలంగాణ గల్లీలో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మకర సంక్రాంతి ప్రతిపక్షాల భ్రాంతిని తొలగించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

తెరాస భవన్​లో సోషల్ మీడియా బృందాలతో కేటీఆర్

ఇవీ చూడండి: ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం

TG_HYD_60_13_ktr_on_uttam_on_lakshman_pkg_3064645 REPORTER: NAGESHWARA CHARY ( ) టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే.. కాంగ్రెస్ హయాంలో మున్సిపాల్టీలకు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు సవాల్ విసిరారు. తనకు భాజపా అంటే భయమన్న లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పురపాలక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా లేని భాజపాకు... హుజూర్ నగర్ నగర్ డిపాజిట్ కోల్పోయిన భాజపాకు.. తానెందుకు భయపడుతానన్నారు. మోదీ, రాహుల్ సహా ఎవరికీ తాను భయపడనని.. తన బాస్ లు దిల్లీలో లేరని.. గల్లీలో ఉన్నారన్నారు. ఈ మకర సంక్రాంతి విపక్షాల భ్రాంతిని తొలగించాలన్నారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తెరాస సామాజిక మాధ్యమ సైనికులు.. సంస్కారవంతంగా తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. LOOK... వాయిస్ ఓవర్: కాంగ్రెస్ హయాంలో మున్సిపాల్టీలకు నిధులు ఎక్కువ విడుదల అయ్యాయంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. 2004 నుంచి 2014 మధ్య విడుదల చేసిన నిధుల కన్నా.. గత ఐదేళ్లలో రెట్టింపు నిధులను విడుదల చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. తనకు భాజపా అంటే భయమని లక్ష్మణ్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆరువందలకు పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలపలేక పోయినందుకు భయపడాలా లేక హుజూర్ నగర్ లో కారు గుర్తును పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థికి పోలైనన్ని ఓట్లు కూడా దక్కించుకోనందుకు ఆ పార్టీకి భయపడాలా అని ఎద్దేవా చేశారు. మోదీ, రాహుల్ సహా తాను ఎవరికీ భయపడనని... ఎందుకంటే తన బాస్ లు దిల్లీలో లేరని.. తెలంగాణ గల్లీలో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మకర సంక్రాంతి ప్రతిపక్షాల భ్రాంతిని తొలగించాలని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో తెరాస సోషల్ మీడియా బృందాలతో కేటీఆర్ సమావేశమయ్యారు. బైట్: కేటీ రామారావు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు వాయిస్ ఓవర్: తెరాస సామాజిక మాధ్యమాల సైనికులు.. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సత్యం, సమాచారం, సంస్కారంతో తిప్పి కొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ సందేశాన్ని ప్రతీ గడపకూ చేర్చాలన్నారు. తెరాసకు సోషల్ మీడియా ఓ బలమని.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని... ఇతర పార్టీలు దరిదాపులో కూడా లేరని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉంటారని... ప్రజల నాడి తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఓ సాధనంగా కేసీఆర్ భావిస్తారన్నారు. కొన్ని పార్టీలు పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తలతో... చిచ్చుపెట్టేందుకే వాడుకుంటున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తెరాసకు సామాజిక మాధ్యమాల్లో పెయిడ్ కార్యకర్తలు లేరని...తెరాసపై అభిమానంతో పనిచేస్తున్నవారేనన్నారు. ఫించన్లలో కేంద్రం వాటాపై భాజపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి అంశాలపై వాస్తవాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించాలని కేటీఆర్ తెలిపారు. తెరాస సామాజిక మాధ్యమాల కార్యకర్తలు..సంయమనంతో వ్యవహరించాలని... సంస్కారవంతంగానే విపక్షాల దుష్ప్రచారన్ని తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. బైట్: కేటీ రామారావు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు వాయిస్ ఓవర్: మున్సిపాల్టీల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు ద్వారా కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని కేటీఆర్ తెలిపారు. గతంలో చాలా మున్సిపాల్టీల్లో 14 రోజులకు ఓసారి నీళ్లు వచ్చేవని... ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కొత్త మున్సిపాల్టీ చట్టం ద్వారా అవినీతిని రూపుమారుతామని...అందులో పర, తమ బేధాలు ఉండవని స్పష్టం చేశారు. పల్లె ప్రగతి అనంతరం పట్టణ ప్రగతి నిర్వహిస్తామన్నారు. END
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.