ETV Bharat / state

KTR Meeting with War Room Incharges : "సర్వేలన్ని బీఆర్​ఎస్​ గెలుస్తుందని చెబుతున్నాయ్​"

KTR Meeting with War Room Incharges : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల వార్​రూమ్​లు ఏర్పాటు చేశామని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్​లోని జలవిహార్​లో వార్​రూమ్​ ఇన్​ఛార్జిలతో సమావేశమై.. వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు.

KTR and Harish Rao on Election Campaign
Elections War Rooms Arrangements in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 3:14 PM IST

Updated : Oct 22, 2023, 4:12 PM IST

KTR Meeting with War Room Incharges : ఎన్నికల సన్నదతలో భాగంగా.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అన్ని రకాలుగా సమాయత్తం అవ్వడం కోసం.. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల వార్‌రూమ్‌లు ఏర్పాటు చేశామని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​(KTR) తెలిపారు. వార్‌రూమ్‌లో ప్రతినిధులతో హైదరాబాద్‌లోని జలవిహార్‌లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టో, ప్రచారాస్త్రాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేటీఆర్​, హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు.

KTR Discussion on Election Campaign : కేంద్ర ఎన్నికల కార్యాలయంతో ఎలా పనిచేయాలి, ఎన్నికల ప్రచారంలో ప్రతి రోజు ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాలపై కేటీఆర్​ చర్చించారు. ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.. తదితర విషయాల గురించి మాట్లాడారు. ప్రజల్లో బీఆర్​ఎస్​పై నమ్మకం ఉందని.. 119 నియోజకవర్గాల ఇన్​చార్జ్​లు, వార్​ రూమ్​ ప్రతినిధులు తెలిపారు. గత రెండు రోజుల్లో ముడు సర్వే రిపోర్ట్​లు బయటకి వచ్చాయని.. వాటన్నింటిలో బీఆర్​ఎస్​కి 70కి పైగా స్థానాలు వస్తాయని గుర్తు చేశారు. కేసీఆర్(KCR)​ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని సర్వే ఏజెన్సీలు కూడా చెబుతున్నాయి. సానుకూలంగా ఉన్న ప్రజల్ని.. బీఆర్ఎస్(BRS)​ ఓటుగా ఎలా మలచాలి.. ఎలాంటి పద్దతులు అవలింభించాలని చర్చించుకున్నామని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ కచ్చితంగా జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

KTR Comments on Congress and BJP : బీజేపీ మొదటి ఎన్నికల జాబితాలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి(Kishan Reddy)కి సీటు దక్కలేదని.. ఎన్నికల రణరంగంలో వెన్నుచూపి పారిపోయారని విమర్శించారు. 119 స్థానాల్లో దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులే లేరని ఆరోపించారు. అలానే కాంగ్రెస్​ పార్టీకి 40 స్థానాల్లో లేరని అన్నారు. సంస్కారం గురించి కాంగ్రెస్(Congress)​ నుంచి నేర్చుకునే అవసరం తమకు లేదని.. వారే నేర్చుకోవాలని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ దౌర్భాగ్య స్థితిలో ఉందని.. ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్ష పదవిని అమ్ముకునే స్థాయికి దిగజారిందని ఆరోపించారు. హస్తం​ పార్టీ నాయకులు తమ అధ్యక్షుడు సీట్లు కోసం డబ్బులు వసూలు చేస్తున్నాడని.. ఈడీకి పిర్యాదు చేస్తున్నారని అన్నారు.

"గత రెండు రోజుల్లో ముడు సర్వే రిపోర్టులు వచ్చాయి. అందులో బీఆర్​ఎస్​కు 70కి స్థానాలు వచ్చాయి. ప్రజలకు కేసీఆర్​పై విశ్వాసం ఉంది. ఎన్నికల్లో కచ్చితంగా మేమే గెలుస్తాం. గతంలో కంటే ఎక్కువ స్థానాలు వస్తాయి. క్షేత్రస్థాయిలో బీఆర్​ఎస్​పై నమ్మకం ఉంది.. దాన్ని ఓటుగా మలిచేందుకు చర్చించుకున్నాం. బీజేపీకు దాదాపు 100 స్థానాలకు అభ్యర్థులే లేరు. కాంగ్రెస్​కు 40 స్థానాలకు అభ్యర్ధుల లేరు. కాంగ్రెస్​ నాయకుల నుంచి సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు." - కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

KTR Meeting with War Room Incharges : "సర్వేలన్ని బీఆర్​ఎస్​ గెలుస్తుందని చెబుతున్నాయ్​"

KTR Chit Chat : సీఎం పదవిపై నాకు ఎటువంటి పిచ్చి ఆలోచనలు లేవు: కేటీఆర్‌

KTR in Thanksgiving Meeting of Disabled People : తెలంగాణలోనే అధిక పింఛన్​లు.. దివ్యాంగుల కృతజ్ఞత సభలో కేటీఆర్

KTR Speech at Karimnagar BRS Meeting : 'అవసరమైతే.. TSPSCని ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం'

Last Updated : Oct 22, 2023, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.