KTR Laid Foundation Stone for E-Positive Energy Labs In Rangareddy : కొవిడ్ వ్యాక్సిన్‌లో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిన తరహాలో ఈ-మొబిలిటీలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ఈ-బ్యాటరీల్లో 60 శాతం తెలంగాణలోనే తయారవుతాయన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్(Amara raja Batterie LTD) నూతనంగా నిర్మిస్తున్న ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్(E-Positive Energy Labs)కు అమరాజా ఛైర్మన్ గల్లా జయదేవ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, నీతిఅయోగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సలహాదారు సుధేందు సిన్హాలతో కలిసి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.
Amar Raja E-Positive Energy Labs : ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం(Electric mobility sector)లో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గల్లా జయదేవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు అంతా సస్టెనెబులిటీదేనని పేర్కొన్నారు. ప్రతిరోజు కొత్తదనం కోరుకోవడంతోనే అమరరాజా సంస్థ ముందుంటుందని చెప్పారు.
KTR Foundation E-Positive Energy Labs : తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిన తర్వాత.. ఎన్నో గొప్ప సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయని కొనియాడారు. అందుకు అమరరాజా సంస్థ రంగారెడ్డి జిల్లా దివిటీపల్లిలో నిర్మించిన గిగా ఫ్యాక్టరీ కారిడార్‌లో అధునాతన ఇంధన, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఎవాల్స్ సదస్సులో అమరరాజా సావనీర్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
అగ్రికల్చరల్ డేటా ఎక్స్ఛేంజ్ సెంటర్ ప్రారంభం : మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నొవాటెల్‌లో అగ్రికల్చరల్ డేటా ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫారం, అగ్రికల్చరల్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్ వర్క్ సేవలను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలో తొలి అగ్రికల్చరల్ డేటా ఎక్స్ఛేంజ్ ఇది అని.. తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చిన సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో కీలక వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని.. గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు.
KTR Launch Agricultural Data Exchange Center : రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. ప్రతి గింజ కొంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరే రాష్ట్రంలోనూ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేశారు. రైతుబంధు కింద ఏటా ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా పెద్ద ఎత్తున చెరువులను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో పామాయిల్ సాగు 20 లక్షల ఎకరాల్లో విస్తరింపజేసేందుకు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తున్నామని ప్రకటించారు. హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, పింక్ విప్లవం, ఎల్లో విప్లవం వంటి వాటిని తెలంగాణ చేరుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ అగ్రికల్చరల్ డేటా ఎక్స్ఛేంజ్ వల్ల క్రెడిట్, వెదర్, అడ్వైజరీ, క్రాప్ మేనేజ్మెంట్ సేవలు త్వరితగతిన అందిస్తాయని చెప్పారు.
KTR on Agriculture Sector : 'ప్రపంచంలో దేన్ని ఆపగలిగినా.. వ్యవసాయ రంగాన్ని మాత్రం ఆపలేం'