హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరిశీలించారు. ఇక్కడ శుద్ధి అయిన మురికినీరు హుస్సేన్ సాగర్‌లోకి వెళ్తోంది. తొలుత వేసవి కార్యాచరణ ప్రణాళికపై జలమండలి కార్యాలయంలో కేటీఆర్ సమీక్షించారు.
అనంతరం నెక్లెస్‌రోడ్‌లోని మురుగునీటి శుద్ధి కేంద్రానికి మంత్రి వెళ్లారు. అక్కడ నీటి నమూనాలను పరిశీలించారు. నీటి శుద్ధి విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటిశుద్ధికి సంబంధించి పలు సూచనలు, సలహాలను వారికి కేటీఆర్ అందించారు.
ఇదీ చూడండి : లాక్డౌన్ 3.0: మాస్కు లేకుండా బయటకొస్తే జరిమానా