ETV Bharat / state

మోయలేని భారం మోపే వారే.. మోదీ: కేటీఆర్

KTR Tweet: కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడటం కామన్. రోటిన్‌కు భిన్నంగా ఈసారి ఓ కవిత్వం రాసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని కవిత రూపంలో విమర్శించారు. పేదలకు కట్టెలపొయ్యి దిక్కయ్యింది అంటూ... రాసుకొచ్చారు మంత్రి కేటీఆర్.

KTR TWEET
KTR TWEET
author img

By

Published : Oct 14, 2022, 10:57 AM IST

KTR Tweet: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఎప్పుడూ ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే మంత్రి... ఈసారి కూడా కేంద్రంపై తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. గ్యాస్ వెయ్యి అయ్యింది... పేదలకు కట్టెలపొయ్యి దిక్కయ్యిందని ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పేదోడి పొట్ట కొడుతున్నారు.. చేతిలో పొగగొట్టం పెడుతున్నారని పేర్కొన్నారు. మహిళలకు అర్థమైంది, మోయలేని భారం మోపే వారే, మోదీ అని.. అంటూ పోస్ట్ చేశారు.

ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం... ఆడబిడ్డలపై ఆర్థిక భారమా? అని ప్రశ్నించారు. మోదీ పాలనలో ధరలు ఆకాశంలో.. ఆదాయాలు పాతాళంలో.. అని వెల్లడించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంట.. సామాన్యుల గుండెల్లో గ్యాస్ మంట అంటూ రాసుకొచ్చారు.

''ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప... ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?

గరీబోల్ల గుండెలపై మోయలేని.. గుదిబండలు ఈ గ్యాస్ బండలు!

గ్యాస్ వెయ్యి అయ్యింది.. పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యింది!

పేదోడి పొట్టగొట్టడం.. మళ్లీ చేతిలో పొగగొట్టం పెట్టడమే!

సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి.. ఇప్పుడు 3 సిలిండర్ల జపం చేస్తరా?

మూడు సిలిండర్లతో... మూడుపూటలా వంట సాధ్యమా?'' అంటూ కవిత్వం రూపంలో ఆవేదన వ్యక్తం చేశారు.

పేద మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే భాజపా పతనం షురూ అయిందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తరు.. కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా? అని ప్రశ్నించారు. ''రూ.400 ఉన్న సిలిండర్ ధర.. ఇప్పుడు రూ.1100.. ఇంకా పెరుగుతూనే ఉంది... ఆయిల్ కంపెనీలకు కాదు... ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు ఇయ్యాలే స్పెషల్ ప్యాకేజ్...'' అని ట్వీట్ చేశారు.

  • ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం.!!
    ఆడబిడ్డలపై ఆర్థిక భారమా.?

    Modi పాలనలో
    ధరలు ఆకాశంలో..
    ఆదాయాలు పాతాళంలో...

    ఆయిల్ కంపెనీలకు కాసుల పంట..
    కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట

    ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప
    ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?

    గరీబోల్ల గుండెలపై మోయలేని
    గుదిబండలు..ఈ గ్యాస్ బండలు pic.twitter.com/nm053j8CbC

    — KTR (@KTRTRS) October 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.