ETV Bharat / state

భాజపాపై 132 కోట్ల ఛార్జిషీట్లు వేయాలి: కేటీఆర్​ - గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల వార్తలు

తమపై ఛార్జిషీట్​ వేశామని భాజపా నేతలు అంటున్నారని.. మేం వేయాల్సి వస్తే 132 కోట్ల ఛార్జిషీట్లు వేయాల్సి వస్తుందని కేటీఆర్​ హెచ్చరించారు. విశ్వనగరం మన నినాదమైతే విద్వేష నగరం భాజపా నినాదంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు.

KTR
భాజపాపై 132 కోట్ల ఛార్జిషీట్లు వేయాలి: కేటీఆర్​
author img

By

Published : Nov 22, 2020, 7:24 PM IST

Updated : Nov 22, 2020, 7:48 PM IST

కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ ఛార్జిషీట్లు​ వేశామంటున్నారని.. మేం వేయాల్సి వస్తే 132 కోట్లు ఛార్జిషీట్లు వేయాల్సి వస్తుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. జీరో అకౌంట్​లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ... ఎంతమందికి వేశారని ప్రశ్నించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్​ నియోజకవర్గం పరిధిలోని జహీరానగర్‌ రోడ్‌ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని కేంద్రాన్ని నిలదీశారు. విశ్వనగరం మన నినాదమైతే విద్వేష నగరం భాజపా నినాదంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు కైవసం చేసుకున్నామని.. ఇప్పుడు ప్రజల ఆశీర్వాదంతో సెంచరీ కొడతామని ధీమా వ్యక్తం చేశారు.

భాజపా, కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ఉందా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో, వరద సమయంలో హైదరాబాద్‌లో తిరిగింది ఎవరని నిలదీశారు. రూ.10 వేలు ఇస్తుంటే అడ్డుపడి.. ఇప్పుడు రూ.25 వేలు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. ఆరున్నర లక్షల మంది లబ్ధిదారుల జాబితా ఇస్తాం.. వాళ్లకు రూ.25 వేలు ఇప్పించండని భాజపా నేతలకు సవాల్​ విసిరారు. డిసెంబరు 4 తర్వాత అర్హులైన అందరికీ వరదసాయం అందుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కొంతమంది ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్​లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేని పంచాయతీ పెట్టి కెలికి కయ్యం పెట్టుకొని.. విడగొట్టి నాలుగు ఓట్లు, సీట్లు కోసం చిల్లర రాజకీయం చేస్తున్నారు. హైదరాబాద్​లో శాంతిభద్రతలు కాపాడినందకా.. పెట్టుబడులు తీసుకొస్తున్నందుకా.. ఎందుకు ఛార్జిషీట్లు వేయాలి. ఎన్నికల సమయంలోనే చార్మినార్​లోని భాగ్యలక్ష్మి ఆలయం ఎందుకు గుర్తొస్తుంది.

- కేటీఆర్​. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

భాజపాపై 132 కోట్ల ఛార్జిషీట్లు వేయాలి: కేటీఆర్​

ఇవీచూడండి: ప్రపంచంలోనే సురక్షితమైన నగరం హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్

Last Updated : Nov 22, 2020, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.