ETV Bharat / state

KTR Fires at Central Government : 'నేతన్నలపై.. రాష్ట్ర సర్కార్ వరాల జల్లు ' - KTR fires on Narendra Modi

KTR Fires at Central Government : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేతన్నలపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. సెప్టెంబర్‌ నుంచి చేనేతమిత్ర పథకం, నేతన్నకు ఐదు లక్షల బీమా, 10,000ల ఫ్రేమ్‌ మగ్గాలు, ఆరోగ్య కార్డుల ద్వారా ఓపీ-సేవలు తదితర పథకాలను మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చేనేతపై కేంద్రం జీఎస్టీ వేయడం నేతన్నలపై వివక్ష చూపించడమేనని మంత్రి ఆక్షేపించారు. కార్మికులకు ఎప్పుడూ అండగా నిలబడతామని కేటీఆర్ వెల్లడించారు.

KTR participated in National Handloom Day

author img

By

Published : Aug 7, 2023, 3:59 PM IST

Updated : Aug 7, 2023, 9:02 PM IST

KTR Participated in National Handloom Day నేతన్నలపై రాష్ట్ర సర్కార్ వరాల జల్లు

KTR Fires at Central Government : చేనేత కార్మికులకు మరింత చేయూతనిచ్చేలా కొన్ని కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు చేస్తున్నట్లు చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రూ.40 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామన్నారు. చేనేత, అనుబంధ కార్మికులకు.. గుర్తింపు కార్డులు ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు ఓపీ- సేవలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

Handloom Entrepreneur : కష్టపడితే కానిదేముందని నిరూపిస్తున్న మహిళ

KTR on Handloom : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మన్నెగూడలో పలువురు నేత కళాకారులకు.. కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలను కేటీఆర్ (KTR participated in National Handloom Day) అందించారు. చేనేత రంగానికి డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా రూ.200 కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. చేనేత కార్మికులు ఇంటి వద్ద షెడ్ నిర్మించుకునేందుకు సాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. చేనేత మిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ.3,000 ఇస్తామని చెప్పారు. ఈ పథకాన్ని ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని కేటీఆర్ వివరించారు.

KTR Fires at Central Government GST on Handloom : ఈ క్రమంలోనే 59 ఏళ్ల నుంచి 75 సంవత్సరాలలోపు చేనేత కార్మికులకు.. రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం కల్పిస్తుందని కేటీఆర్ ప్రకటించారు. మృతి చెందిన నేత కార్మికుల కుటుంబానికి టెస్కో సాయం రూ.25,000కు పెంచుతున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విమర్శించారు. చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన నేత నరేంద్ర మోదీపై ఆయన ధ్వజమెత్తారు. 'చేనేత వద్దు.. అన్నీ రద్దు' అనేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనన్న మంత్రి .. ఆ సర్కార్‌లో బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రోత్సహించాలని కేటీఆర్ కోరారు.

Netannaku Cheyutha scheme: 'నేతన్నకు చేయూత'.. సెప్టెంబర్ 1 నుంచి నమోదు ప్రక్రియ

"నేతన్నకు బీమాను ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించింది. చేనేత హెల్త్‌ కార్డులను ఇస్తున్నాం. ఔట్‌ పెషెంట్‌ చేనేతలకు ఇక నుంచి రూ.25,000 అందుతాయి. 75ఏళ్లు దాటిన చేనేతలకు ప్రభుత్వ బీమా కల్పిస్తాం. కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టాం. కొత్తగా 16,000 లకు పైగా కొత్త మగ్గాలు ఇవ్వబోతున్నాం. చేనేతలకు ప్రభుత్వమే ఉచితంగా గుర్తింపు కార్డులు ఇస్తుంది. టెస్కో పరిమితిని రూ.25,000కు పెంచుతున్నాం. నేతన్నలకు ఇంటికి దగ్గరలో షెడ్డు నిర్మించుకోడానికి ఆర్థిక సాయం చేస్తాం. చేనేత కార్మికులపై కేంద్రం వివక్ష చూపుతోంది. చేనేత వద్దు, అన్నీ రద్దు అనేలా వ్యవహరిస్తోంది." - కేటీఆర్, మంత్రి

అంతకుముందు హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో చేనేత కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులకు కేటీఆర్, ఎమ్మెల్యే సుభాశ్‌ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయనున్న చేనేత మ్యూజియం కోసం ఉప్పల్‌లోని శిల్పారామం వద్ద 500 గజాల స్థలాన్ని కేటాయించారు. చేనేత వస్త్ర వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయదారుల సమావేశాలు, సదస్సుల కోసం చేనేత కన్వెన్షన్ సెంటర్‌ నిర్మించనున్నారు. దీనికోసం ఉప్పల్ భగాయత్‌లో 2,375 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

Handloom Declaration on August 7 : ఆగస్టు 7న చేనేత డిక్లరేషన్.. దిల్లీకి తరలుతున్న దేశవ్యాప్త చేనేత ప్రతినిధులు

Pochampally silk sarees : ఉద్యోగం వదలి.. చేనేత వైపు కదిలాడు.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు

Last Updated : Aug 7, 2023, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.